టీడీపీకి ‘లోకేశ్’ వైరస్ పట్టుకుంది.. టీకా తారక్ 9999
సంచలన దర్శకుడు ఆర్జీవీ మరోసారి ట్విట్టర్లో చెలరేగిపోయాడు. ఈ సారి ఏకంగా తెలుగు దేశం పార్టీపైనే గురిపెట్టాడు. టీడీపీకి లోకేశ్ అనే వైరస్ పట్టుకుందని ఆ వైరస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నదని వ్యాఖ్యానించాడు. ఆ వైరస్‌కు వ్యాక్సిన్ ఏమిటో కూడా ఆర్జీవీ చెప్పేశాడు. వ్యాక్సిన్ పేరు తారక్ 9999 అంట. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే టీడీపీకి వచ్చిన వైరస్ పోతుందంట. రామ్‌గోపాల్ వర్మ పెట్టిన ఈ ట్వీట్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తరచూ వివాదాస్పద విషయాలపై కామెంట్లు […]
సంచలన దర్శకుడు ఆర్జీవీ మరోసారి ట్విట్టర్లో చెలరేగిపోయాడు. ఈ సారి ఏకంగా తెలుగు దేశం పార్టీపైనే గురిపెట్టాడు. టీడీపీకి లోకేశ్ అనే వైరస్ పట్టుకుందని ఆ వైరస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నదని వ్యాఖ్యానించాడు. ఆ వైరస్‌కు వ్యాక్సిన్ ఏమిటో కూడా ఆర్జీవీ చెప్పేశాడు. వ్యాక్సిన్ పేరు తారక్ 9999 అంట. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే టీడీపీకి వచ్చిన వైరస్ పోతుందంట. రామ్‌గోపాల్ వర్మ పెట్టిన ఈ ట్వీట్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తరచూ వివాదాస్పద విషయాలపై కామెంట్లు పెట్టే ఆర్జీవి ఈ సారి ఏకంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం గమనార్హం.
‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ అంటూ ఓ సినిమాను తెరకెక్కించి సంచలనం సృష్టించాడు వర్మ. ఆ తర్వాత పవర్ స్టార్ అంటూ ఓ పొలిటికల్ సెటైర్ సినిమాను వదిలాడు. ఇటీవల రాజకీయాలను కూడా వదలడం లేదు. రక్త చరిత్ర నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు తెరకెక్కిస్తున్నాడు వర్మ. గతంలో వంగవీటి అనే ఓ సినిమాను కూడా తీశాడు. అయితే నిత్యం వివాదాస్సద కామెంట్లు చేయడం.. సంచలనం సృష్టించిన ఘటనల ఆధారంగా సినిమాలు తీయడం వర్మకు అలవాటే.
అయితే రాజకీయాలపై చాలా తక్కువ సందర్భాల్లోనే వర్మ ట్వీట్లు పెడుతుంటాడు. తాజాగా టీడీపీపై ట్వీట్లు పెట్టడం సంచలనంగా మారింది. ఈ ట్వీట్లపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ‘తెలుగుదేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన సూక్ష్మ జీవి పట్టుకుంది.. అది ప్రాణాంతక వ్యాధి. ఆ వైరస్ నివారణగా పనిచేసే ఏకైక టీకా ఉందని.. దాని పేరే తారక్9999’ అంటూ వర్మ పేర్కొన్నారు.
టీడీపీకి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆరే అంటూ వర్మ గతంలోనూ ఓ సారి ట్వీట్ పెట్టాడు. తాజాగా నారా లోకేశ్న టార్గెట్ చేస్తూ ట్వీట్ పెట్టడం గమనార్హం. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వర్మ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు వర్మ చేసిన సూచన 100 శాతం కరెక్ట్ అంటూ సమర్థిస్తున్నారు. టీడీపీ అభిమానులు మాత్రం .. ‘మా పార్టీ వ్యవహారం నీకు ఎందుకు’ అంటూ వర్మను ప్రశ్నిస్తున్నారు.
దీనిపై టీడీపీ ముఖ్యనేతలు ఇంకా స్పందించలేదు. లోకేశ్‌పై గత కొంతకాలంగా సొంతపార్టీనుంచే విమర్శలు వస్తున్నాయి. కొందరు నాయకులు బహిరంగంగానే జూనియర్ ని పార్టీలోకి తేవాలని కోరారు.