Telugu Global
NEWS

రాష్ట్రంలో అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్..

రాష్ట్రంలో సెకండ్ వేవ్ అల్లాడిస్తోంది. దీనికి తోడు వ్యాక్సిన్‌ లు, ఇంజెక్షన్ లు ఆఖరికి ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఒకపక్క కరోనా మరోపక్క అవసరాల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆఖరికి టెస్టింగ్ సెంటర్లలో కిట్లకు కూడా కొరత ఏర్పడింది. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ వేయించుకుందామంటే డోసుల నిల్వలు అయిపోయాయి. అలాగే ఆపదలో ఉన్నవారికి రెమిడెసివిర్ ఇంజెక్షన్లు దొరకడం లేదు. అన్నింటి కంటే ముఖ్యంగా ఆస్పత్రుల్లో సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ […]

రాష్ట్రంలో అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్..
X

రాష్ట్రంలో సెకండ్ వేవ్ అల్లాడిస్తోంది. దీనికి తోడు వ్యాక్సిన్‌ లు, ఇంజెక్షన్ లు ఆఖరికి ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్రంలో ఒకపక్క కరోనా మరోపక్క అవసరాల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆఖరికి టెస్టింగ్ సెంటర్లలో కిట్లకు కూడా కొరత ఏర్పడింది. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ వేయించుకుందామంటే డోసుల నిల్వలు అయిపోయాయి. అలాగే ఆపదలో ఉన్నవారికి రెమిడెసివిర్ ఇంజెక్షన్లు దొరకడం లేదు. అన్నింటి కంటే ముఖ్యంగా ఆస్పత్రుల్లో సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడంలేదు. ఎమర్జెన్సీ కేసులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌లు లేక అడ్మిషన్లు దొరకడంలేదు. ఇలా అన్ని సమస్యలు ఒక్కసారిగా వచ్చి పడి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు రోజుకు సగటున 250 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే, ఇప్పుడు అది సుమారు 350 టన్నులకు పెరిగింది. కానీ కేంద్రప్రభుత్వం నుండి ఆక్సిజన్ అందడం లేదు. అలాగే రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసులకు తీవ్ర కొరత ఏర్పడింది. పదిహేను రోజులకు సరిపడా 30 లక్షల డోసుల్ని పంపాల్సిందిగా గత వారం ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ 2.46 లక్షల డోసులు మాత్రమే శనివారం అందాయి. తాజాగా మంగళవారం రాత్రికి మరో ఏడున్నర లక్షల డోసులు రానున్నాయి.
రాష్ట్రంలో రోజుకు ఒకటిన్నర లక్షల టెస్టులు చేసే సామర్ధ్యం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చెప్తోంది. కానీ టెస్టింగ్ కిట్‌ల కొరత కారణంగా అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది.
వీటితో పాటు సీరియస్ గా ఉన్న పేషెంట్లకు రెమిడెసివర్ ఇంజెక్షన్ల అవసరం రావడంతో వాటి బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. ఇలా సెకండ్ వేవ్ ఉన్నట్టుండి రాష్ట్రాన్ని గజగజలాడిస్తోంది.

First Published:  20 April 2021 4:59 AM GMT
Next Story