Telugu Global
NEWS

తెలంగాణలో నైట్​ కర్ఫ్యూ..! థియేటర్లు కూడా బంద్​

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరోవైపు హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలకు పూనుకున్నది. రాష్ట్రంలో నైట్​ కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఏప్రిల్​ 20 ( మంగళవారం) నుంచి మే 1 వరకు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొన్నది. ఇటీవల కరోనా కట్టడిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ […]

తెలంగాణలో నైట్​ కర్ఫ్యూ..! థియేటర్లు కూడా బంద్​
X

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరోవైపు హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలకు పూనుకున్నది. రాష్ట్రంలో నైట్​ కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఏప్రిల్​ 20 ( మంగళవారం) నుంచి మే 1 వరకు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొన్నది. ఇటీవల కరోనా కట్టడిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే జోక్యం చేసుకోవాల్సి ఉంటుందంటూ కోర్టు పేర్కొన్నది. అదే రోజు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ మాట్లాడుతూ.. తెలంగాణలో లాక్​డౌన్​ పెట్టే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం రాత్రి కర్ఫ్యూ విధించబోతున్నట్టు ప్రకటించింది. మీడియా, వైద్యసేవలు, ఐటీ రంగానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు.

నైట్​ కర్ఫ్యూతో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమలు కాబోతున్న నేపథ్యంలో డీజీపీ మహేందర్​రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అందరూ దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారసంస్థలు మూసివేయాలని సూచించారు. పోలీసులు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని పేర్కొన్నారు.మరోవైపు ఐటీ, మీడియా, వైద్య సిబ్బంది పోలీసులకు సహకరించాలని.. వాళ్లకు ఐడీ కార్డులు చూపించాలని కోరారు.

థియేటర్లు బంద్​..!

రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాత్రి ఎనిమిది గంటల వరకు థియేటర్లలో షోలు నడుపుకొనే వెసలుబాటు ఉన్నది. అయినప్పటికీ రేపటి నుంచి థియేటర్లను మూసివేయాలని తెలంగాణ థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఏకగీవ్ర నిర్ణయం తీసుకుంది.

కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు.

అయితే ఇటీవల విడుదలైన ‘వకీల్​ సాబ్’ చిత్రానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లు ఓపెన్ లో ఉంటాయి. కాగా ఈ ఒక్క చిత్రానికి మినహాయింపు ఇవ్వడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. ​

First Published:  20 April 2021 4:04 PM IST
Next Story