Telugu Global
NEWS

సాగర్​ సభే కొంపముంచిందా? అక్కడే కేసీఆర్​కు కరోనా..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ఎన్నికలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నాయి. కరోనా వ్యాప్తికి ఇది కూడా ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ సమావేశాలు నిర్వహించవచ్చు.. కానీ రాజకీయ పార్టీల సభలకు వేలసంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అక్కడ నిబంధనలు పాటించడం అంత తేలిక కాదు. ఇటీవల సీఎం కేసీఆర్​ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఫామ్​హౌస్​లో […]

సాగర్​ సభే కొంపముంచిందా? అక్కడే కేసీఆర్​కు కరోనా..!
X

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ఎన్నికలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నాయి. కరోనా వ్యాప్తికి ఇది కూడా ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నిబంధనలు పాటిస్తూ సమావేశాలు నిర్వహించవచ్చు.. కానీ రాజకీయ పార్టీల సభలకు వేలసంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అక్కడ నిబంధనలు పాటించడం అంత తేలిక కాదు. ఇటీవల సీఎం కేసీఆర్​ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఫామ్​హౌస్​లో ఉండి చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉంటే సీఎం కు కరోనా సోకడానికి ప్రధాన కారణం సాగర్​ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగసభేనని సమాచారం. ఈ సభలో పాల్గొన్న చాలా మందికి కరోనా సోకింది. సీఎం కేసీఆర్​కు, టీఆర్​ఎస్​ అభ్యర్థి నోముల భగత్​కు, టీఆర్​ఎస్​ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, అంజయ్య యాదవ్​కు కూడా కరోనా సోకింది. వీళ్లకు సాగర్​ బహిరంగసభలోనే కరోనా సోకినట్టు సమాచారం.

సాగర్​ సభకు వచ్చిన కొందరికి కరోనా సోకిందట. దీంతో ఆ సభకు వెళ్లిన చాలామందికి కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. సాగర్​ ఉప ఎన్నికను కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్​ 14న సీఎం కేసీఆర్​ బహిరంగసభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలోనే పలువురికి కరోనా సోకినట్టు సమాచారం.

టీఆర్​ఎస్ బహిరంగ సభలో కరోనా నిబంధనలు పాటించలేదని.. వేలాది మందిని తరలించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మరోవైపు సాగర్​లో ప్రచారంలో పాల్గొన్న పలువురు బీజేపీ నేతలకు కూడా కరోనా సోకినట్టు సమాచారం.

ప్రస్తుతం సీఎం కేసీఆర్​ కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేసీఆర్​కు ప్రస్తుతం స్వల్ప కరోనా లక్షణాలే ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు. ఆయనకు కరోనా లక్షణాలు ఎక్కవైతే ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

First Published:  20 April 2021 3:54 AM IST
Next Story