టీసర్కారుపై హైకోర్టు సీరియస్ .. కరోనాపై ఏదో ఒకటి తేల్చాలని ఆదేశం..!
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 48 గంటల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని.. బార్లు, క్లబ్బులు, పబ్‌లపై ఆంక్షలు విధించాలని, లేదంటే తామే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొన్నది. రాష్ట్రంలో కరోనా కేసులు, టెస్టులు, ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లపై ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వడం లేదని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు […]
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 48 గంటల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని.. బార్లు, క్లబ్బులు, పబ్‌లపై ఆంక్షలు విధించాలని, లేదంటే తామే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొన్నది.
రాష్ట్రంలో కరోనా కేసులు, టెస్టులు, ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లపై ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వడం లేదని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రతి రోజు ఎన్ని టెస్టులు చేస్తున్నారు. ఎంతమందికి కరోనా సోకింది. ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి. తదితర వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేయాలని కోరింది.
రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22 తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే పాఠశాలలు, విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది.
అయితే బార్లు, పబ్బులు కొనసాగించడం.. రాత్రిపూట కర్ఫ్యూ విధించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం టెస్టులు చేయడం లేదని.. చాలా మంది కరోనా బారిన పడుతున్నా వివరాలు వెల్లడించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రంలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితి లేదని.. రాత్రి కర్ఫ్యూ కూడా విధించే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.