18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్..!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ మూడో దశ వ్యాక్సినేషన్ విస్తృతంగా చేపట్టబోతున్నట్టు పేర్కొన్నది. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు.. ఇక నుంచి తాము తయారు చేసిన డోసుల్లో 50 శాతం కేంద్రానికి ఇవ్వాల్సి […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ మూడో దశ వ్యాక్సినేషన్ విస్తృతంగా చేపట్టబోతున్నట్టు పేర్కొన్నది.
దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు.. ఇక నుంచి తాము తయారు చేసిన డోసుల్లో 50 శాతం కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతం డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు ఓపెన్ మార్కెట్కు ఇవ్వొచ్చని కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
కేంద్ర తీసుకున్న 50 శాతం డోసులను అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేయనున్నది. కరోనా వ్యాప్తి తీవ్రత ఆధారంగా ఏయే ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ఇవ్వాలి.. అనే విషయాన్ని కేంద్రం నిర్ణయించనున్నది.
ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్ విధించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కరోనా పై ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ ఇచ్చేశారు. రెండో దశ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. 45 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు.
అయితే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డోసుల కొరత వేధిస్తున్నది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ .. అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మేరకు ప్రకటన జారీచేసింది.