కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!
కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్లకు డీఏ( కరువు భత్యం) అందజేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2021 జూలై 1 నుంచి డీఏ అమల్లోకి రానున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. 2020 జనవరి, జూలై, 2021 జనవరి తేదీల్లో డీఏ ( కరువు భత్యం ) చెల్లించాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో ఈ చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో కేంద్రం త్వరలో కరువు భత్యం చెల్లించనున్నట్టు […]
కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్లకు డీఏ( కరువు భత్యం) అందజేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2021 జూలై 1 నుంచి డీఏ అమల్లోకి రానున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు.
2020 జనవరి, జూలై, 2021 జనవరి తేదీల్లో డీఏ ( కరువు భత్యం ) చెల్లించాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో ఈ చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో కేంద్రం త్వరలో కరువు భత్యం చెల్లించనున్నట్టు ప్రకటించింది.
ఏడో వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు 17 శాతం డీఏ పొందుతున్నారు.
ప్రస్తుతం ఈ డీఏను కొంత శాతం పెంచారు. బేసిక్ పే, డీఏ, ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ), ప్రయాణ భత్యం (టీఏ), వైద్య అలవెన్స్ తదితరాలు కలుస్తాయి. ప్రతిపాదిత డీఏ పెరగడంతో వారి ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్), గ్రాట్యూటీ కూడా పెరుగుతాయి. కనీస వేతనంలో నిర్దిష్ట శాతం, డీఏతో కలిపి పీఎఫ్, గ్రాట్యూటీ భాగస్వామ్యాన్ని నిర్ణయిస్తారు.