Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ సినిమా మరింత ఆలస్యం

కరోనా ఎఫెక్ట్ ప్రభాస్ సినిమాలపై కూడా పడింది. ప్రస్తుతం అతడు నటిస్తున్న ఆదిపురుష్ సినిమా ఆగిపోవడంతో, ఆ మేరకు నాగ్ అశ్విన్ తో చేయాల్సిన సినిమా మరింత ఆలస్యం కానుంది. లెక్కప్రకారం జులై నుంచి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లాలి ప్రభాస్. ఇదే విషయాన్ని గతంలో నాగ్ అశ్విన్ కూడా వెల్లడించాడు. అయితే ఆదిపురుష్ లేట్ అవ్వడంతో నాగ్ అశ్విన్ తో చేయాల్సిన సైన్స్-ఫిక్షన్ సినిమాను వాయిదా వేశాడు ప్రభాస్. కావాలనుకుంటే ఆదిపురుష్ తో […]

ప్రభాస్ సినిమా మరింత ఆలస్యం
X

కరోనా ఎఫెక్ట్ ప్రభాస్ సినిమాలపై కూడా పడింది. ప్రస్తుతం అతడు నటిస్తున్న ఆదిపురుష్ సినిమా
ఆగిపోవడంతో, ఆ మేరకు నాగ్ అశ్విన్ తో చేయాల్సిన సినిమా మరింత ఆలస్యం కానుంది.

లెక్కప్రకారం జులై నుంచి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లాలి ప్రభాస్. ఇదే విషయాన్ని
గతంలో నాగ్ అశ్విన్ కూడా వెల్లడించాడు. అయితే ఆదిపురుష్ లేట్ అవ్వడంతో నాగ్ అశ్విన్ తో
చేయాల్సిన సైన్స్-ఫిక్షన్ సినిమాను వాయిదా వేశాడు ప్రభాస్.

కావాలనుకుంటే ఆదిపురుష్ తో పాటు నాగ్ అశ్విన్ సినిమాను కూడా ప్రభాస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ
ఆదిపురుష్ పూర్తయేంత వరకు మరో సినిమా (సలార్ కాకుండా) మొదలుపెట్టడానికి వీల్లేదు. ఆ మేరకు
ఆదిపురుష్ నిర్మాతలు అగ్రిమెంట్ రాయించుకున్నారు. అందుకే నాగ్ అశ్విన్ సినిమా వాయిదా పడింది.
అన్నీ అనకున్నట్టు జరిగితే అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

First Published:  19 April 2021 3:07 PM IST
Next Story