Telugu Global
National

ఆక్సిజన్​ రైళ్లు వచ్చేస్తున్నాయి..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ ఏ రేంజ్​లో పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ చాలా మందికి ఈ విషయం పట్టడం లేదు. రాజకీయాపార్టీలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆధ్యాత్మిక, ధార్మిక ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. ఇక ప్రజలు కూడా కరోనా అనే విషయాన్ని మరిచిపోయి మాస్కులు లేకుండానే రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పటికే చాలా ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. మరోవైపు చాలా ఆస్పత్రుల్లో బెడ్ల కొరత నెలకొన్నది. ఇది మంచి అవకాశం అనుకొని ప్రైవేట్​ ఆస్పత్రులు […]

ఆక్సిజన్​ రైళ్లు వచ్చేస్తున్నాయి..!
X

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ ఏ రేంజ్​లో పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ చాలా మందికి ఈ విషయం పట్టడం లేదు. రాజకీయాపార్టీలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆధ్యాత్మిక, ధార్మిక ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. ఇక ప్రజలు కూడా కరోనా అనే విషయాన్ని మరిచిపోయి మాస్కులు లేకుండానే రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పటికే చాలా ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి.

మరోవైపు చాలా ఆస్పత్రుల్లో బెడ్ల కొరత నెలకొన్నది. ఇది మంచి అవకాశం అనుకొని ప్రైవేట్​ ఆస్పత్రులు కరోనా పేషెంట్ల నుంచి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా చాలా రాష్ట్రాల్లో కరోనా పేషెంట్లకు ఆక్సిజన్​ కొరత ఏర్పడ్డట్టు సమాచారం.

కరోనా వచ్చిన వాళ్లకు స్వల్ప లక్షణాలు ఉంటే హోమ్​ ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ తీవ్రమైన లక్షణాలు ఉన్నవాళ్లకు మాత్రం ఆస్పత్రిలో చికిత్స అవసరం అవుతుంది. అటువంటి వాళ్లకు ఆక్సిజన్ ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే చాలా ఆస్పత్రులు కరోనా రోగులకు ఆక్సిజన్​ అందిస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా సెకండ్​ వేవ్​ తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఆక్సిజన్​ కొరత ఏర్పడే అవకాశం ఉందని సీఎం ఉద్ధవ్​ థాక్రే భావించారు. తమకు ఆక్సిజన్​ కావాలని.. ఇందుకోసం ప్రత్యేక రైళ్ల ద్వారా ఆక్సిజన్​ తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన గతంలో కేంద్ర రైల్వేశాఖకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాపై రైల్వేశాఖ‌ కీలక నిర్ణయం తీసుకున్నది.

లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సిలిండర్లను రవాణా చేయడానికి ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’లను నడుపుతామని రైల్వే శాఖ ప్ర‌క‌టించింది. ముంబైలోని కలంబోలీ, ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని బొయీసర్‌ రైల్వే స్టేషన్ల నుంచి రోడ్‌ ట్యాంకర్లను ఫ్లాట్‌ వ్యాగన్లపై ఎక్కించి విశాఖ, జంషెడ్‌పూర్‌, రూర్కెలా, బొకారొకు ఇవాళ తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. అక్కడ ట్యాంకర్లలో మెడికల్‌ ఆక్సిజన్‌ను లోడ్‌ చేశాక తిరిగి ప్రయాణమవుతాయి.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఆక్సిజన్​ రైళ్లను తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్​ కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.

First Published:  19 April 2021 7:49 AM IST
Next Story