Telugu Global
National

మొలకెత్తే మాస్కులు తెలుసా?

కరోనాతో ఒక్కసారిగా అంతకుముందెన్నడూ లేని విధంగా మాస్కుల వినియోగం పెరిగిపోయింది. దాంతో మాస్కుల వేస్టేజీ శాతం కూడా బాగానే పెరిగింది. వాడిపడేసిన మాస్కుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. అందుకే వీటి వేస్టేజీని తగ్గించేందుకు ఓ ఐడియాను రూపొందించింది మంగళూరులోని ఓ సంస్థ. వాడిపారేసిన మాస్కుల నుంచి మొక్కలు మొలిచేలా సీడ్‌ మాస్కులు తయారు చేస్తుంది పేపర్ సీడ్ అనే సంస్థ. దళసరి పేపర్‌, పల్చటి వస్త్రం మధ్యలో టమాటా, తులసి, దోసకాయ, క్యాప్సికం విత్తనాలను పెట్టి మాస్కులు […]

మొలకెత్తే మాస్కులు తెలుసా?
X

కరోనాతో ఒక్కసారిగా అంతకుముందెన్నడూ లేని విధంగా మాస్కుల వినియోగం పెరిగిపోయింది. దాంతో మాస్కుల వేస్టేజీ శాతం కూడా బాగానే పెరిగింది. వాడిపడేసిన మాస్కుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. అందుకే వీటి వేస్టేజీని తగ్గించేందుకు ఓ ఐడియాను రూపొందించింది మంగళూరులోని ఓ సంస్థ.

వాడిపారేసిన మాస్కుల నుంచి మొక్కలు మొలిచేలా సీడ్‌ మాస్కులు తయారు చేస్తుంది పేపర్ సీడ్ అనే సంస్థ. దళసరి పేపర్‌, పల్చటి వస్త్రం మధ్యలో టమాటా, తులసి, దోసకాయ, క్యాప్సికం విత్తనాలను పెట్టి మాస్కులు తయారు చేస్తున్నారు. ఈ మాస్కులను వాడి పడేసిన తర్వాత.. అందులోని విత్తనాలు నేలలోకి ఇంకి, తర్వాత మొలకెత్తుతాయి. పర్యావరణానికి మేలు చేసే ఈ మాస్కులను అందరూ వాడాలని, వీటిని ఒకసారి మాత్రమే వాడి తర్వాత పడేయాలని సంస్థ చెప్తోంది. ఈ మాస్కులకు సిటీస్ లో మంచి డిమాండ్ ఉంటుందని, ఇప్పటికే చెన్నై, బెంగళూరు సహా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయన్నారు పేపర్‌ సీడ్‌ సంస్థ నిర్వాహకులు.

First Published:  19 April 2021 9:07 AM IST
Next Story