Telugu Global
Cinema & Entertainment

కరోనా.. మరో సినిమా ఆగింది

కరోనా ఎఫెక్ట్ మరో సినిమాపై పడింది. ఇప్పటికే ఆచార్య, సర్కారువారి పాట లాంటి సినిమాల షూటింగ్ లు నిలిచిపోగా.. తాజాగా ఈ లిస్ట్ లో గోపీచంద్ సినిమా కూడా చేరింది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ అనే సినిమా షూటింగ్ ను నిలిపివేశారు. గతేడాది లాక్ డౌన్ టైమ్ లో ఈ సినిమా కథ రాసుకున్నాడు మారుతి. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే షూట్ స్టార్ట్ చేశాడు. అయితే అంతలోనే సెకెండ్ వేవ్ […]

కరోనా.. మరో సినిమా ఆగింది
X

కరోనా ఎఫెక్ట్ మరో సినిమాపై పడింది. ఇప్పటికే ఆచార్య, సర్కారువారి పాట లాంటి సినిమాల షూటింగ్ లు
నిలిచిపోగా.. తాజాగా ఈ లిస్ట్ లో గోపీచంద్ సినిమా కూడా చేరింది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్
హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ అనే సినిమా షూటింగ్ ను నిలిపివేశారు.

గతేడాది లాక్ డౌన్ టైమ్ లో ఈ సినిమా కథ రాసుకున్నాడు మారుతి. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే
షూట్ స్టార్ట్ చేశాడు. అయితే అంతలోనే సెకెండ్ వేవ్ మొదలైంది. దీంతో రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక
షూటింగ్ ఆపేశాడు నిర్మాత దిల్ రాజు.

పైగా ఇప్పటికిప్పుడు సినిమా రిలీజ్ చేసే పరిస్థితులు కూడా లేవు. గీతా సంస్థలోనే తెరకెక్కుతున్న మోస్ట్
ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. 18-పేజెస్ అనే మరో సినిమా కూడా అలానే
పడి ఉంది. ఇలాంటి టైమ్ లో గోపీచంద్ సినిమాను ఆఘమేఘాల మీద పూర్తిచేయడం అనవసరం అని
భావించాడు అల్లు అరవింద్. అందుకే సినిమా షూటింగ్ ఆపేశాడు

First Published:  19 April 2021 3:02 PM IST
Next Story