Telugu Global
Cinema & Entertainment

మైత్రీ మూవీ మేకర్స్ లో అఖిల్?

ఆర్ఎక్స్ 100 విజయం తర్వాత కొంతమంది నిర్మాతల వద్ద నుంచి అడ్వాన్సులు అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. అందులో ఒక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ కోసం అజయ్ భూపతి ఇప్పటికే ఓ స్టోరీలైన్ రెడీ చేశాడు. కథ నచ్చడంతో మైత్రీ నిర్మాతలు ఆ స్టోరీలైన్ ను లాక్ చేసి పెట్టుకున్నారు. ఈ గ్యాప్ లో మహాసముద్రం సినిమాను స్టార్ట్ చేశాడు అజయ్. అయితే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై […]

మైత్రీ మూవీ మేకర్స్ లో అఖిల్?
X

ఆర్ఎక్స్ 100 విజయం తర్వాత కొంతమంది నిర్మాతల వద్ద నుంచి అడ్వాన్సులు అందుకున్నాడు
దర్శకుడు అజయ్ భూపతి. అందులో ఒక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ కోసం అజయ్
భూపతి ఇప్పటికే ఓ స్టోరీలైన్ రెడీ చేశాడు. కథ నచ్చడంతో మైత్రీ నిర్మాతలు ఆ స్టోరీలైన్ ను లాక్ చేసి
పెట్టుకున్నారు. ఈ గ్యాప్ లో మహాసముద్రం సినిమాను స్టార్ట్ చేశాడు అజయ్.

అయితే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చేయాల్సిన ప్రాజెక్టుకు సంబంధించి చిన్న కదలిక
వచ్చింది. ఈ సినిమా కోసం అఖిల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు మేకర్స్. తిరుపతి బ్యాక్ డ్రాప్
ఉన్న యాక్షన్-లవ్ సబ్జెక్ట్ అది. ఈ క్యారెక్టర్ కు అఖిల్ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.

ప్రస్తుతానికైతే ఇటు అఖిల్, అటు అజయ్ భూపతి ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ
త్వరలోనే అఖిల్ ను కలిసి స్టోరీలైన్ వినిపించబోతున్నాడు అజయ్. లైన్ నచ్చితే అఖిల్ వెంటనే ఓకే
చెప్పడం గ్యారెంటీ. ప్రస్తుతం అఖిల్ చేతిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలున్నాయి.
వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంకాగా.. ఏజెంట్
సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది.

First Published:  18 April 2021 9:25 AM IST
Next Story