Telugu Global
Cinema & Entertainment

నేచురల్ స్టార్ కోసం నేచురల్ సెట్

ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ హీరో కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది శ్యామ్ సింగరాయ్. ఈ బడ్జెట్ లో ఆరున్నర కోట్ల రూపాయలు కేవలం ఒకే ఒక్క సెట్ కోసం కేటాయించారు నిర్మాత వెంకట్ బోయినపల్లి. ఈ సినిమాలో కోల్ కతా బ్యాక్ డ్రాప్ ఉంది. అలా అని ఇప్పటి కోల్ కతా కాదు. దాదాపు 50 ఏళ్ల కిందటి కోల్ కతా నగరాన్ని ఇందులో చూపించారు. అందుకే […]

నేచురల్ స్టార్ కోసం నేచురల్ సెట్
X

ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ హీరో కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది శ్యామ్ సింగరాయ్. ఈ బడ్జెట్ లో ఆరున్నర కోట్ల రూపాయలు కేవలం ఒకే ఒక్క సెట్ కోసం కేటాయించారు నిర్మాత వెంకట్ బోయినపల్లి.

ఈ సినిమాలో కోల్ కతా బ్యాక్ డ్రాప్ ఉంది. అలా అని ఇప్పటి కోల్ కతా కాదు. దాదాపు 50 ఏళ్ల కిందటి కోల్ కతా నగరాన్ని ఇందులో చూపించారు. అందుకే శ్యామ్ సింగరాయ్ కోసం వింటేజ్ కోల్ కతా సెట్ వేశారు. హైదరాబాద్ శివార్లలోని 10 ఎకరాల సెట్ లో ఈ భారీ కోల్ కతా సెట్ రూపుదిద్దుకుంది.

ఆర్ట్ డైరక్టర్ అవినాష్ కొల్ల ఈ సెట్ ను రూపొందించాడు. దీని కోసం అక్షరాలా ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు అయింది. త్వరలోనే ఈ సెట్ లో నానిపై షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. వీటిలో సింగరాయ్ అనే పాత్రకు కోల్ కతా నేపథ్యం ఉంది. ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాల్నే ఈ సెట్ లో తీయబోతున్నారు. సినిమాలో ఈ సెట్ హైలెట్ అవుతుందంటున్నారు.

సాయిపల్లవి, కృతి షెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు టాక్సీవాలా సినిమాను తీసిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు.

First Published:  18 April 2021 9:23 AM IST
Next Story