కార్పొరేషన్ లో కలిసి పోటీ..! బీజేపీ, జనసేన నిర్ణయం..!
ఖమ్మం కొర్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. పొత్తు విషయంపై ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుగా జనసేన పోటీచేయాలని నిర్ణయించుకున్నది. కొన్ని స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ కూడా దాఖలు చేశారు. కానీ అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తరఫున ప్రచారం ఏమీ చేయలేదు. ఇదిలా ఉంటే ఇటీవల […]
ఖమ్మం కొర్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. పొత్తు విషయంపై ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుగా జనసేన పోటీచేయాలని నిర్ణయించుకున్నది. కొన్ని స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ కూడా దాఖలు చేశారు.
కానీ అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన బీజేపీ తరఫున ప్రచారం ఏమీ చేయలేదు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం జనసేన .. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతు ఇవ్వడం గమనార్హం. బీజేపీ నేతలు తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని.. మిత్రధర్మం పాటించడం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు పీవీ కూతురు వాణిదేవికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా కంగుతున్నారు. కొందరు నేతలు ఏకంగా పవన్ కల్యాణ్‌పైనే విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తిరుపతి పార్లమెంట్ స్థానానికి కూడా జనసేన పోటీచేయలేదు. అక్కడ బీజేపీకే మద్దతు ఇచ్చింది. కానీ అనూహ్యంగా తెలంగాణలోని ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్టు జనసేన ప్రకటించింది. బీజేపీతో కలిసి ఇక్కడ పోటీచేస్తామని పేర్కొన్నది.
ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ బీజేపీ నేతలు, పవన్ కల్యాణ్ చర్చలు జరిపినట్టు సమాచారం. నిజానికి జనసేన ప్రభావం తెలంగాణలో పెద్దగా ఉండదు. హైదరాబాద్‌లో కొంత ప్రభావం చూపవచ్చు. ఇదిలా ఉంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లా వాతావరణం కాస్త విభిన్నంగా ఉంటుంది. అక్కడ కొంత ఆంధ్రా కల్చర్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో పోటీచేయాలని జనసేన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. దీంతో అక్కడి నేతల ఒత్తిడి మేరకు పోటీకి సిద్ధ పడ్డట్టు సమాచారం.
ఖమ్మం తోపాటు వరంగల్ కార్పొరేషన్‌కు కొన్ని మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కేవలం ఖమ్మంలోనే పోటీచేస్తుందా? లేక మిగతా స్థానాల్లో కూడా పోటీచేస్తుందా? అన్నది వేచి చూడాలి.