Telugu Global
NEWS

ఆర్టీసీ రిటైర్డ్​ ఉద్యోగులకు గుడ్​న్యూస్​..! బకాయిల చెల్లింపు...!

ఆర్టీసీలో రిటైర్డ్​ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా రోజులుగా పెండింగ్​లో ఉన్న బకాయిలను చెల్లించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ ఉద్యోగులకు 2017-19 మధ్య కాలంలో దాదాపు 146.04 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం జగన్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బకాయిలను చెల్లించబోతున్నట్టు ప్రకటించారు. అందుకనుగుణంగా రెండు విడతల్లో బకాయిలు చెల్లించాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ […]

ఆర్టీసీ రిటైర్డ్​ ఉద్యోగులకు గుడ్​న్యూస్​..! బకాయిల చెల్లింపు...!
X

ఆర్టీసీలో రిటైర్డ్​ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా రోజులుగా పెండింగ్​లో ఉన్న బకాయిలను చెల్లించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ ఉద్యోగులకు 2017-19 మధ్య కాలంలో దాదాపు 146.04 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం జగన్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బకాయిలను చెల్లించబోతున్నట్టు ప్రకటించారు.

అందుకనుగుణంగా రెండు విడతల్లో బకాయిలు చెల్లించాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీ ఆర్​పీ ఠాకూర్​ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగన్​ నిర్ణయంతో దాదాపు 5027 మంది రిటైర్ట్​ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. అప్పటి ప్రభుత్వం ఆర్జిత సెలవులు, గ్రాట్యుటీ బకాయిలు పెండింగ్​లో పెట్టింది. దీంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తమ బకాయిలు చెల్లించాలని వాళ్లు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే అప్పటి సీఎం చంద్రబాబు వాళ్ల డిమాండ్​ను పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్​ అధికారంలోకి వచ్చిన వెంబడే బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా 2017 ఏప్రిల్‌ 1 నుంచి 2017 సెపె్టంబర్‌ 30 మధ్యలో రిటైరైన 1,653 మంది బకాయిలు రూ.33.77 కోట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 27న చెల్లించారు. 2017 అక్టోబరు 1 నుంచి 2018 మార్చి 31 మధ్యలో రిటైరైన 1,069 మంది ఉద్యోగులకు రూ.28.65 కోట్లను ఈ ఏడాది మార్చి 25న చెల్లించారు. మిగిలిన రెండు విడతలను ఈ నెల 27, 30 తేదీల్లో చెల్లించాలని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

2018 ఏప్రిల్‌ 1 నుంచి 2018, సెప్టెంబర్​ 30 మధ్యలో రిటైరైన 1,643 మందికి బకాయిల మొత్తం రూ.55.53 కోట్లు ఈ నెల 27న చెల్లిస్తారు. 2018 అక్టోబర్‌ 1 నుంచి 2019 ఫిబ్రవరి 28న మధ్యలో రిటైరైన 662 మందికి బకాయిల మొత్తం రూ.28.08 కోట్లు ఈ నెల 30న చెల్లించబోతున్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆర్టీసీ రిటైర్డ్​ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  17 April 2021 5:07 AM GMT
Next Story