వకీల్ వసూళ్లు.. అంతా గప్ చుప్
వకీల్ సాబ్ సినిమా రిలీజైన తర్వాత సక్సెస్ సంబరాలంటూ విడుదల రోజు హంగామా చేశాడు నిర్మాత దిల్ రాజు. అంతే.. ఆ మరుసటి రోజు నుంచి మళ్లీ కనిపించలేదు. మధ్యలో 2-3 ఫంక్షన్లు పెట్టినా, దర్శకుడు కనిపించాడు కానీ, నిర్మాత కనిపించలేదు. దీంతో కలెక్షన్ల గురించి అధికారిక ప్రకటన చేసేవాళ్లే కరువయ్యారు. ప్రస్తుతం వకీల్ సాబ్ వసూళ్లకు సంబంధించి బయట వినిపిస్తున్న అంకెన్నీ అనధికారికమే. ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా రాలేదు. అలాంటి […]
వకీల్ సాబ్ సినిమా రిలీజైన తర్వాత సక్సెస్ సంబరాలంటూ విడుదల రోజు హంగామా చేశాడు నిర్మాత
దిల్ రాజు. అంతే.. ఆ మరుసటి రోజు నుంచి మళ్లీ కనిపించలేదు. మధ్యలో 2-3 ఫంక్షన్లు పెట్టినా,
దర్శకుడు కనిపించాడు కానీ, నిర్మాత కనిపించలేదు. దీంతో కలెక్షన్ల గురించి అధికారిక ప్రకటన చేసేవాళ్లే
కరువయ్యారు.
ప్రస్తుతం వకీల్ సాబ్ వసూళ్లకు సంబంధించి బయట వినిపిస్తున్న అంకెన్నీ అనధికారికమే. ప్రొడక్షన్
హౌజ్ నుంచి ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా రాలేదు. అలాంటి దిల్ రాజు ఈ రోజు మీడియా సమావేశం
పెట్టాడు. దీంతో అంతా వకీల్ సాబ్ వసూళ్ల గురించి ప్రశ్నించారు. అయితే దిల్ రాజు మాత్రం మరోసారి
ముఖం చాటేశాడు.
సినిమా అద్భుతంగా ఉంది, రెండో వారంలోకి వచ్చిందని ప్రకటించుకున్న ఈ నిర్మాత.. వసూళ్ల గురించి
అడిగినప్పుడు మాత్రం ఆన్సర్ దాటేశాడు. నా పెట్టుబడికి, రాబడికి సరిపోయిందని మాత్రమే చెప్పాడు.
అయినా పవన్ తో సినిమా తీయడం తన ధ్యేయమని, ఇలాంటి డ్రీమ్ ప్రాజెక్టుకు వసూళ్ల గురించి
ఆలోచించకూడదని చెబుతూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు.