కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఆలయాల మూత ..!
దేశంలో కరోనా కేసులు ఓ రేంజ్లో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సీఎం జగన్ తిరుపతి పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతేకాక ఎప్పటికప్పుడు అధికారులతో కరోనా వ్యాప్తిపై సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో ఉంచాలని.. కోవిడ్ పేషెంట్లకు హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అంతేకాక రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసివేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజువారి కేసుల […]
దేశంలో కరోనా కేసులు ఓ రేంజ్లో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే సీఎం జగన్ తిరుపతి పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతేకాక ఎప్పటికప్పుడు అధికారులతో కరోనా వ్యాప్తిపై సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో ఉంచాలని.. కోవిడ్ పేషెంట్లకు హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
అంతేకాక రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను మూసివేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజువారి కేసుల సంఖ్య రెండు లక్షలు దాటుతున్నది. దేవాలయాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని అధికారులు ఇప్పటికే మూసివేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కేవలం అర్చకులు మాత్రమే పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం, పురావస్తు అధికారుల సమక్షంలో ఆలయానికి నోటీస్ అంటించారు. మే 15 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు నోటీసులో తెలిపారు.
కోదండరామాలయంతో పాటు కడప జిల్లాలోని మరో 15 ఆలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ వేడుకలు జరుగుతాయా? లేదా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.
ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను కూడా మూసివేశారు. నందలూరులోని సౌమ్యనాథస్వామి ఆలయం మూసివేశారు. పురావస్తు శాఖ, దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. దక్షిణకాశిగా పిలువబడే పుష్పగిరిలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని మూసివేశారు. అలాగే కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోటను ముసివేశారు.