లాలూకు బెయిల్ మంజూరు..
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్డేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట లభించింది. పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆయనపై పలు ఆరోపణలు నమోదయిన విషయం తెలిసిందే. లాలూ యాదవ్‌పై మొత్తం 4 కేసులు నమోదు కాగా వాటిలో మూడు కేసుల్లో బెయిల్ వచ్చింది. తాజాగా మరో కేసులో లాలూకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పాట్నా హైకోర్ట్ ప్రకటించింది. దుమ్కా ఖజానా కేసులో ఆయనకు బెయిల్ లభించడంతో రాంచీ జైలు నుంచి ఆయన బయటకు […]
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్డేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట లభించింది. పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆయనపై పలు ఆరోపణలు నమోదయిన విషయం తెలిసిందే. లాలూ యాదవ్‌పై మొత్తం 4 కేసులు నమోదు కాగా వాటిలో మూడు కేసుల్లో బెయిల్ వచ్చింది. తాజాగా మరో కేసులో లాలూకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పాట్నా హైకోర్ట్ ప్రకటించింది. దుమ్కా ఖజానా కేసులో ఆయనకు బెయిల్ లభించడంతో రాంచీ జైలు నుంచి ఆయన బయటకు రావడానికి మార్గం సుగమమం అయ్యింది.
బీహర్ ముఖ్యమంత్రిగా పని చేసే సమయంలో దాణా కుంభకోణం జరిగినట్లు తేలింది. ఆ కేసులో అరెస్ట్ అయిన లాలూ ప్రసాద్ 2017 నుంచి జైలులో ఉంటున్నారు. జైలు నుంచే పలు విచారణలు ఎదుర్కుంటున్న లాలూ.. మూడు కేసుల్లో బెయిల్ పొందారు. అయితే ఆయన అనారోగ్యంతో ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా చివరి కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది.
కాగా, జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసే సమయంలో పలు నిబంధనలు విధించింది. కోర్టు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లరాదని చెప్పింది. అంతే కాకుండా బెయిల్ పొంది బయట ఉన్న సమయంలో ఇంటి అడ్రస్ మార్చరాదని, ఫోన్ నెంబర్ కూడా పాతదే ఉపయోగించాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో ఉన్న లాలూ.. నాలుగు కేసుల్లో కూడా బెయిల్ లభించడంతో త్వరలో ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.