Telugu Global
Cinema & Entertainment

టాలీవుడ్ లో మరో దర్శకుడికి కరోనా?

టాలీవుడ్ లో మరో దర్శకుడు కరోనా బారిన పడ్డాడు. మొన్నటికిమొన్న దర్శకుడు త్రివిక్రమ్ కు పాజిటివ్ వచ్చింది. దాన్నుంచి ఆయన కోలుకున్నాడు కూడా. ఇప్పుడు మరో దర్శకుడు అనీల్ రావిపూడి కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్ లో ఉన్నాడు. అనీల్ రావిపూడికి కరోనా సోకడంతో ఆయన ప్రస్తుతం డైరక్ట్ చేస్తున్న ఎఫ్3 సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దీంతో వెంకటేష్, వరుణ్ తేజ్ కాల్షీట్లు వృధా అయ్యాయి. మొన్ననే ఉగాది రోజున ఈ […]

Anil Ravipudi
X

టాలీవుడ్ లో మరో దర్శకుడు కరోనా బారిన పడ్డాడు. మొన్నటికిమొన్న దర్శకుడు త్రివిక్రమ్ కు పాజిటివ్
వచ్చింది. దాన్నుంచి ఆయన కోలుకున్నాడు కూడా. ఇప్పుడు మరో దర్శకుడు అనీల్ రావిపూడి కరోనా
బారిన పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్ లో ఉన్నాడు.

అనీల్ రావిపూడికి కరోనా సోకడంతో ఆయన ప్రస్తుతం డైరక్ట్ చేస్తున్న ఎఫ్3 సినిమా షూటింగ్
నిలిచిపోయింది. దీంతో వెంకటేష్, వరుణ్ తేజ్ కాల్షీట్లు వృధా అయ్యాయి. మొన్ననే ఉగాది రోజున ఈ
సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు. అంతలోనే అనీల్ రావిపూడికి ఈ కష్టమొచ్చింది.

టాలీవుడ్ ను కరోనా సెకెండ్ వేవ్ గట్టిగా తాకింది. చాలామంది దర్శకులు, టెక్నీషియన్స్, నిర్మాతలు,
జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి టాలీవుడ్ లో షూటింగ్స్
నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

First Published:  17 April 2021 2:21 PM IST
Next Story