Telugu Global
Business

ఆండ్రాయిడ్ 12 ఎలా ఉంటుందంటే

గూగుల్ ఆండ్రాయిడ్ 12 డెవలపర్ ప్రివ్యూ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరిన్ని అప్ డేట్స్ తో వస్తున్న లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయంటే.. స్క్రోలింగ్ స్క్రీన్ షాట్: ఆండ్రాయిడ్ 12లో స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ అనే ఫీచర్ ఉన్నట్లు తెలుస్తుంది.

Android 12
X

గూగుల్ ఆండ్రాయిడ్ 12 డెవలపర్ ప్రివ్యూ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరిన్ని అప్ డేట్స్ తో వస్తున్న లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయంటే..

స్క్రోలింగ్ స్క్రీన్ షాట్: ఆండ్రాయిడ్ 12లో స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ అనే ఫీచర్ ఉన్నట్లు తెలుస్తుంది.

పవర్ బటన్ తో గూగుల్ అసిస్టెంట్: గూగుల్ అసిస్టెంట్ షార్ట్ కట్ ట్రిగ్గర్‌ను పవర్ బటన్‌లో ఉంచేలా ఇందులో ఫీచర్ ఉండబోతోంది.

ఈ వెర్షన్ లో ఛార్జింగ్ కోసం కొత్త యానిమేషన్‌ ఉండబోతోంది. ఇక వీటితో పాటు విడ్జెట్‌లో సెర్చ్ బార్ ఉంటుంది. యూజర్స్.. యాప్ జాబితాను స్క్రోల్ చేయడానికి బదులుగా విడ్జెట్స్ సాయంతో ఏ యాప్ నైనా ఇట్టే ఓపెన్ చేసే ఆప్షన్ ఇందులో ఉంటుంది.

ఆండ్రాయిడ్ 12 లో వాల్యూమ్ యూఐలో మార్పులు రాబోతున్నాయి. కొత్తగా రూపొందించిన వాల్యూమ్ స్లైడర్ మందంగా కనిపిస్తుంది. అలాగే సిస్టమ్ కలర్ కు అనుగుణంగా యూఐ మారిపోతుంది.

First Published:  17 April 2021 11:21 AM IST
Next Story