45 రోజుల్లో పని పూర్తిచేసిన వెంకీ
కథ నచ్చితే వెంకటేష్ స్పీడ్ ఎలా ఉంటుందో మరోసారి తెలిసొచ్చింది. తన తాజా సినిమాకు సంబంధించి వెంకీ అప్పుడే షూటింగ్ పూర్తిచేశాడు. కేవలం 2 షెడ్యూల్స్ లో, 45 రోజుల్లో సినిమా మొత్తం పూర్తయింది. దృశ్యం-2 తెలుగు రీమేక్ వ్యవహారం ఇది. ఈమధ్యే ఈ సినిమాను లాంఛ్ చేశారు. అప్పుడే షూటింగ్ పూర్తిచేశారు. హైదరాబాద్, కేరళలో నిర్వహించిన 2 భారీ షెడ్యూల్స్ తో దృశ్యం-2 తెలుగు రీమేక్ కు సంబంధించి వెంకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది. […]
కథ నచ్చితే వెంకటేష్ స్పీడ్ ఎలా ఉంటుందో మరోసారి తెలిసొచ్చింది. తన తాజా సినిమాకు సంబంధించి వెంకీ అప్పుడే షూటింగ్ పూర్తిచేశాడు. కేవలం 2 షెడ్యూల్స్ లో, 45 రోజుల్లో సినిమా మొత్తం పూర్తయింది. దృశ్యం-2 తెలుగు రీమేక్ వ్యవహారం ఇది.
ఈమధ్యే ఈ సినిమాను లాంఛ్ చేశారు. అప్పుడే షూటింగ్ పూర్తిచేశారు. హైదరాబాద్, కేరళలో నిర్వహించిన 2 భారీ షెడ్యూల్స్ తో దృశ్యం-2 తెలుగు రీమేక్ కు సంబంధించి వెంకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది. పక్కా ప్లానింగ్ తో దర్శకుడు జీతూ జోసెఫ్, వెంకీకి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేశాడు.
మలయాళంలో ఈ సినిమా ఇప్పటికే పెద్ద హిట్. కాకపోతే థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. ఓటీటీలో రిలీజ్ చేశారు. సినిమా బాగుండడంతో తెలుగు రీమేక్ ను వెంటనే మొదలుపెట్టారు. ఈసారి ఎలాంటి ప్రయోగాలకు పోకుండా మలయాళం వెర్షన్ ను డైరక్ట్ చేసిన జీతూ జోసెఫ్ కే తెలుగు రీమేక్ బాధ్యతలు కూడా అప్పగించారు. వీలైతే ఎఫ్3 కంటే ముందే దృశ్యం-2ను విడుదల చేయాలనేది సురేష్ బాబు ఆలోచన. కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. విడుదల తేదీపై కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు.