కోవిడ్ ఎఫెక్ట్ : ఇంతకూ జనం ఓటేయడానికి వస్తారా?
తెలంగాణ రాష్ట్రంలోని సాగర్ అసెంబ్లీకి, ఏపీలోని తిరుపతి పార్లమెంట్‌కు రేపు ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుంది? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ భయం ఎక్కువైంది. రెండు రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో జనం భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు జనం ఓట్లు వేయడానికి ముందుకు వస్తారా? లేదా? అని రాజకీయపార్టీలు భయపడుతున్నాయట. నిన్న సాయంత్రంతోనే ప్రచారం ముగిసింది. […]
తెలంగాణ రాష్ట్రంలోని సాగర్ అసెంబ్లీకి, ఏపీలోని తిరుపతి పార్లమెంట్‌కు రేపు ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుంది? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ భయం ఎక్కువైంది. రెండు రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో జనం భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు జనం ఓట్లు వేయడానికి ముందుకు వస్తారా? లేదా? అని రాజకీయపార్టీలు భయపడుతున్నాయట.
నిన్న సాయంత్రంతోనే ప్రచారం ముగిసింది. దీంతో ఆయా పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి. సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటుకు మూడు వేల నుంచి ఐదువేల వరకు పంచుతున్నట్టు సమాచారం. ప్రజలకు విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మద్యం సీసాలైతే ఏరులై పారుతున్నాయి. పలు చోట్ల వివిధ పార్టీల అభ్యర్థులు గుట్టు చప్పుడు కాకుండా చీరలుపంచుతున్నారు. సాగర్‌లో ఓ ప్రధాన పార్టీ డబ్బు, మద్యం ఏరులై పారిస్తున్నట్టు సమాచారం. ప్రతి వ్యక్తికి ఓ ఫుల్ బాటిల్, రెండు కేజీల మటన్, ఓటుకు మూడు వేల నుంచి ఐదువేల వరకు పంచుతున్నట్టు సమాచారం.
ఇక తిరుపతిలోనూ అధికార ప్రతిపక్షాలు ప్రలోభ పర్వానికి తెరలేపాయి. అన్ని గ్రామాల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నారు. అయితే డబ్బులు తీసుకున్న జనం పోలింగ్ కేంద్రానికి వస్తారా? లేదా? అని నాయకులకు భయం పట్టుకున్నదట.
గ్రామస్థాయిలో నాయకులకు బాధ్యతలు అప్పగించడంతో వాళ్లు ప్రస్తుతం డబ్బు, మద్యం పంచుతున్నారు. రేపు పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చే బాధ్యత కూడా వాళ్ల మీదే పెట్టారట అగ్రనేతలు. రేపు ఎంత పోలింగ్ నమోదవుతుందో వేచి చూడాలి.