తెలంగాణలో నైట్ కర్ఫ్యూ .. కఠిన ఆంక్షలు..!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పాక్షిక లాక్డౌన్ విధించారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు తెలంగాణలో సైతం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఇక్కడ కూడా కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్కూల్స్ బంద్ చేశారు. అయితే బార్లు, పబ్బులు కొనసాగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశం […]
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పాక్షిక లాక్డౌన్ విధించారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు తెలంగాణలో సైతం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఇక్కడ కూడా కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే స్కూల్స్ బంద్ చేశారు. అయితే బార్లు, పబ్బులు కొనసాగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశం లేదని ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అయితే రాత్రి పూట కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు కానీ కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అంతేకాక సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
ఇటీవలే సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. కరోనా వేళ .. నిబంధనలు ఉల్లంఘించి సభ ఎలా నిర్వహిస్తారంటూ విమర్శలు వచ్చాయి. ఈ బహిరంగ సభలో ప్రజలు కరోనా నిబంధనలు పాటించలేదని ప్రతి పక్షాలు విమర్శలు గుప్పించాయి.
ఇదిలా ఉంటే ఇటీవల కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్రమోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. కరోనా నియంత్రణకు రాత్రి పూట కర్ఫ్యూ , మరికొన్ని కఠిన నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. దీంతో కొన్ని రాష్ట్రాలు నిబంధనలు అమలు చేస్తున్నాయి.
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పక్కనే ఉన్న తెలంగాణ సైతం కఠిన ఆంక్షలు అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం మహారాష్ట్రతోపాటు ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతున్నది. పాక్షిక లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు.
తెలంగాణలోనూ రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. వారి దారిలోనే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులతో సమాలోచనలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన సీఎం కేసీఆర్తో భేటీ కానున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.