Telugu Global
NEWS

సాగర్​లో ప్రలోభాల పర్వం..

సాగర్​ ఉప ఎన్నికకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. గురువారంతో ఇక్కడ ప్రచారం ముగియనున్నది. ఇటీవలే సీఎం కేసీఆర్​ కూడా బహిరంగసభ నిర్వహించారు. మరోవైపు ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ బుధవారం రోజు సాగర్​ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కేజీ మటన్​, ఓ ఫుల్​ బాటిల్​ పంపిణీ చేసినట్టు సమాచారం. ఇది తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ కూడా కేజీ […]

సాగర్​లో ప్రలోభాల పర్వం..
X

సాగర్​ ఉప ఎన్నికకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. గురువారంతో ఇక్కడ ప్రచారం ముగియనున్నది. ఇటీవలే సీఎం కేసీఆర్​ కూడా బహిరంగసభ నిర్వహించారు. మరోవైపు ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ బుధవారం రోజు సాగర్​ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కేజీ మటన్​, ఓ ఫుల్​ బాటిల్​ పంపిణీ చేసినట్టు సమాచారం. ఇది తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ కూడా కేజీ చికెన్​, ఓ మందు సీసా పంపిణీ చేసినట్టు టాక్​.

ఇప్పటికే టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ తమ వంతు ప్రచారాలు ముమ్మరంగా చేసుకుంటున్నాయి. గ్రామాల్లో ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించి.. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. కులాల పేరుతో సమ్మేళనాలు నిర్వహించి ఆయా కులాల వాళ్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. వాళ్లకు విందు భోజనాలు ఏర్పాటుచేస్తున్నారు.

ఉప ఎన్నిక కావడంతో టీఆర్​ఎస్​ కు చెందిన ముఖ్యనేతలు, కొందరు ఎమ్మెల్యేలు సాగర్​లో మకాం వేశారు. వివిధ మండలాలకు మంత్రులను, ఎమ్మెల్యేలను ఇంచార్జిలుగా ప్రకటించారు. ఇంటింటి ప్రచారం.. గ్రామాల్లోని పొలాల్లో విందు భోజనాలు ఏర్పాటు చేయడం.. ఇటువంటి కార్యక్రమాలకు ప్రస్తుతం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

కాంగ్రెస్​ పార్టీలోని ముఖ్యనేతలు కూడా సాగర్​లో మకాం వేసి.. తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీఆర్​ఎస్​ నుంచి దివంగత నేత నోముల నరసింహయ్య కుమారుడు భగత్​.. సాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులుగా కాంగ్రెస్​ నుంచి సీనియర్​ నేత జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్​ నాయక్​ బరిలో ఉన్న విషయం తెలిసిందే.

మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ మధ్యే పోటీ నెలకొని ఉన్నది. జానారెడ్డి ఇప్పటికే రెండు దశల్లో ప్రచారం నిర్వహించారు. మరోవైపు టీఆర్ఎస్​ కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నది. నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఏరులై పారుతున్నాయి.

First Published:  15 April 2021 7:26 AM GMT
Next Story