Telugu Global
NEWS

ఏపీలో కూడా టెన్త్ పరీక్షలు రద్దు?

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల నిర్వహణ కూడా కష్టంగానే మారింది. ఇక పరీక్షల నిర్వహణ ఇంకా కష్టసాధ్యమనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగానే ఏపీలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఏపీలో కరోనా కేసులు […]

ఏపీలో కూడా టెన్త్ పరీక్షలు రద్దు?
X

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల నిర్వహణ కూడా కష్టంగానే మారింది. ఇక పరీక్షల నిర్వహణ ఇంకా కష్టసాధ్యమనే వాదన వినిపిస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగానే ఏపీలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ 6 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కష్టంగా మారింది.

సోమవారం ఏపీ సీఎం జగన్​ మోహన్​రెడ్డి విద్యాశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఈ సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. నిజానికి ఈ ఏడాది జూన్​లో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని భావించారు. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో పరీక్షలు నిర్వహించాలా? లేక రద్దు చేయాలా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొన్నది.

మరోవైపు తెలంగాణలో గురుకుల విద్యాలయాలు, పాఠశాలలు తెరిచాక కరోనా ఉధృతి మొదలైంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని, ఇంటర్మీడియట్​ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నది.

ఇక ఏపీలో కూడా పరీక్షల రద్దుపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. మే, జూన్​లో కరోనా కేసులు విపరీతంగా పెరిగి.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. పరీక్షలు నిర్వహిస్తే కేసులు మళ్లీ కేసులు పెరుగుతాయోమోనన్న ఆందోళన ఇటు ప్రభుత్వంలోనూ, అటు విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ నెలకొన్నది.

మరోవైపు భౌతిక దూరం పాటించి, మాస్కులను అందుబాటులో ఉంచి ప్రతి గదిని శానిటైజ్​ చేసి పరీక్షలు నిర్వహించవచ్చు కదా! అని కొందరు విద్యావేత్తలు అంటున్నారు. అయితే ఇది సాధ్యమేనా? అన్న వాదన కూడా తెరమీదకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పది పరీక్షల రద్దుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

First Published:  15 April 2021 5:10 PM IST
Next Story