అస్సలు గ్యాప్ ఇవ్వని మాస్ రాజా
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు రవితేజ. తన రెమ్యూనరేషన్ తగ్గించకుండా ఎవరైతే ముందుకొస్తున్నారో వాళ్లకే ముందుగా కాల్షీట్లు కేటాయిస్తున్నాడు. ఇందులో భాగంగా సుధాకర్ చెరుకూరి బ్యానర్ పై కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు రవితేజ. ఉగాది సందర్భంగా ఈరోజు ఈ సినిమా లాంఛ్ అయింది. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమ వుతున్నారు. శరత్ మండవ మన తెలుగు వారే… గతంలో వెంకటేష్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ […]
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు రవితేజ. తన రెమ్యూనరేషన్ తగ్గించకుండా
ఎవరైతే ముందుకొస్తున్నారో వాళ్లకే ముందుగా కాల్షీట్లు కేటాయిస్తున్నాడు. ఇందులో భాగంగా సుధాకర్
చెరుకూరి బ్యానర్ పై కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు రవితేజ.
ఉగాది సందర్భంగా ఈరోజు ఈ సినిమా లాంఛ్ అయింది. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా
పరిచయమ వుతున్నారు. శరత్ మండవ మన తెలుగు వారే… గతంలో వెంకటేష్, అజిత్, కమల్ హాసన్,
మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు రచయితగా పనిచేశారు.
యదార్థ ఘటనల ఆధారంగా.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తోంది ఈ సినిమా. రవితేజను ఇంతవరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో చూపించబోతున్నాడు దర్శకుడు శరత్.
రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్
సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.