Telugu Global
National

యాప్ లో కరోనా టెస్ట్.. ఎలా పనిచేస్తుందంటే..

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరిస్తోంది. ఈ సెకండ్ వేవ్ లో కరోనా లక్షణాల్లో మార్పులొచ్చాయి. అంతేకాదు చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు కూడా. అందుకే కరోనాను నిర్ధారించుకోవడం కోసం ఇప్పుడు టెస్టులు చేయించుకోక తప్పట్లేదు. అయితే ఈ కరోనా టెస్టుల కోసం వెళ్లే వారి ఇబ్బందులకు చెక్ పెడుతూ.. ఓ యాప్ హల్ చల్ చేస్తోంది. పైసా ఖర్చు లేకుండా కోవిడ్ టెస్టులను స్వయంగా సేఫ్ గా చేసుకోవచ్చని ఆ యాప్ నిర్వాహకులు […]

యాప్ లో కరోనా టెస్ట్.. ఎలా పనిచేస్తుందంటే..
X

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరిస్తోంది. ఈ సెకండ్ వేవ్ లో కరోనా లక్షణాల్లో మార్పులొచ్చాయి. అంతేకాదు చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు కూడా. అందుకే కరోనాను నిర్ధారించుకోవడం కోసం ఇప్పుడు టెస్టులు చేయించుకోక తప్పట్లేదు. అయితే ఈ కరోనా టెస్టుల కోసం వెళ్లే వారి ఇబ్బందులకు చెక్ పెడుతూ.. ఓ యాప్ హల్ చల్ చేస్తోంది. పైసా ఖర్చు లేకుండా కోవిడ్ టెస్టులను స్వయంగా సేఫ్ గా చేసుకోవచ్చని ఆ యాప్ నిర్వాహకులు చెప్తున్నారు. దానిపేరే ‘వోకలిస్ చెక్’. ఇది ఎలా పని చేస్తుందంటే..

వోకలిస్ చెక్ అనే ఈ యాప్.. వాయిస్ ఆధారంగా కరోనాను నిర్ధారిస్తుంది. ఈ యాప్ లో ఎవరైనా తమ వాయిస్ ను ఇస్తే.. అది వారి గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేస్తుంది. దీనికోసం ముందుగా వోకలిస్‌ చెక్‌ యాప్ ను ఓపెన్ చెయ్యాలి. తర్వాత 50 నుంచి 70 వరకూ అంకెలను గట్టిగా లెక్క పెట్టాలి. అప్పుడు ఆ ఆడియో రికార్డ్ అవుతుంది. అనంతరం ఆ ఆడియో స్పెక్టోగ్రామ్‌గా మారి, హీట్‌ ఇమేజ్‌లాగా కనిపిస్తుంది. తర్వాత ఈ హీట్‌ ఇమేజ్ ను కోవిడ్‌ పేషెంట్ల ఆడియోతో పోల్చి కోవిడ్ 19 ఉందో, లేదో చెప్పేస్తుంది. ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనాను అతి తక్కువ టైమ్‌లో ఈ యాప్‌తో నిర్ధారించుకోవచ్చునని ఈ యాప్ ఫౌండర్ షేడీ హసన్‌ తెలిపారు. ఎఐ అల్గారిథమ్స్‌ వాయిస్‌ నమూనా నుంచి 512 విభిన్న లక్షణాలను సేకరించడానికి యాప్‌ను రూపొందించారు. ఇజ్రాయెల్‌కు చెందిన టెక్‌ కంపెనీ వోకలిస్‌ హెల్త్‌ ఈ యాప్‌ను డెవలప్‌ చేసింది. ఇప్పటికే ఉన్న నమూనాల డేటాబేస్‌కు మీ వాయిస్‌ లక్షణాలను సరిపోల్చడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. అయితే ఇది పూర్తిగా కోవిడ్ ను నిర్ధారిస్తుందని చెప్పలేం. కానీ 80 శాతం వరకూ సక్సెస్ రేటు ఉంది. ఫిబ్రవరి నెలలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబైతో కలిసి వోకలిస్‌ హెల్త్‌ కంపెనీ పలువురిపై కరోనా టెస్టులు నిర్వహించింది. సుమారు రెండు వేల మంది వరకూ పేషేంట్స్ పై చేసిన టెస్ట్ ల్లో 81 శాతానికి పైగా సక్సెస్ రేటు వచ్చింది.

First Published:  13 April 2021 11:51 AM GMT
Next Story