Telugu Global
Cinema & Entertainment

ఖిలాడీ అదరగొట్టాడు

రిలీజైన తర్వాత సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కనపెడితే.. రవితేజ సినిమాల టీజర్లు, ట్రయిలర్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు అదే కోవలో రవితేజ నుంచి మరో టీజర్ వచ్చింది. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. ఈరోజు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ లో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు.. అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపిస్తున్నాడు. తను ప్రేమించిన […]

ఖిలాడీ అదరగొట్టాడు
X

రిలీజైన తర్వాత సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కనపెడితే.. రవితేజ సినిమాల టీజర్లు,
ట్రయిలర్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు అదే కోవలో రవితేజ నుంచి మరో టీజర్ వచ్చింది.
రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. ఈరోజు ఈ సినిమా టీజర్ ను
రిలీజ్ చేశారు.

టీజర్ లో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు.. అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కూడా
కనిపిస్తున్నాడు. తను ప్రేమించిన అమ్మాయినే చంపడానికి ప్రయత్నించే షాట్ అయితే టోటల్ టీజర్
లోనే హైలెట్ గా నిలిచింది. రవితేజ ఎంట్రీ కూడా బాగుంది.

టెక్నికల్ గా కూడా టీజర్ చాలా బాగుంది. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
హైలెట్ గా నిలిచాయి. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను మే 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
చేయబోతున్నారు.

First Published:  12 April 2021 1:47 PM IST
Next Story