ప్రధాని ఇచ్చిన నాలుగు సూచనలివే..
ఒకపక్క వ్యాక్సిన్స్ కొరతతో.. సెంటర్లు అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెడుతుంటే.. మరో పక్క దేశంలో టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టీకా ఉత్సవ్ కోసం ప్రధాని మోదీ నాలుగు సూచనలు చేశారు. ఆదివారం ఏప్రిల్ 11న జ్యోతిబా పూలే జయంతి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కావడంతో.. ఈ నాలుగు రోజులను టీకా ఉత్సవ్ నిర్వహించడానికి ప్రత్యేకంగా ఎంచుకున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా ఇవ్వడంతోపాటు వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని […]
ఒకపక్క వ్యాక్సిన్స్ కొరతతో.. సెంటర్లు అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెడుతుంటే.. మరో పక్క దేశంలో టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టీకా ఉత్సవ్ కోసం ప్రధాని మోదీ నాలుగు సూచనలు చేశారు.
ఆదివారం ఏప్రిల్ 11న జ్యోతిబా పూలే జయంతి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కావడంతో.. ఈ నాలుగు రోజులను టీకా ఉత్సవ్ నిర్వహించడానికి ప్రత్యేకంగా ఎంచుకున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా ఇవ్వడంతోపాటు వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని ఈ ఉత్సవ్ లో మోదీ పిలుపునిచ్చారు.
కరోనా వ్యాప్తికి చెక్ పెట్టాలంటే.. దానికి వ్యాక్సినేట్, ట్రీట్, సేవ్, చెక్ అనే నాలుగు సూచనలు పాటించాలని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం45 ఏళ్లకు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సినేషన్ జరుగుతుంది. వీరందరూ.. కొవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని వ్యాక్సిన్లు వేయించుకోవచ్చు.