Telugu Global
Health & Life Style

నిద్ర ఎక్కువైతే ముప్పే..

కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఈ సమ్మర్ లో ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు చాలామంది. దాంతో పగలు కూడా నిద్రపోవడం, రాత్రిళ్లు లేట్‌గా పడుకోవడం లేదా మేల్కొని ఉండడం లాంటివి చేస్తున్నారు. కానీ నిద్ర ఎప్పుడు, ఎంత ఉండాలో అంత ఉంటేనే మంచిది. లేకపోతే మానసికంగా, శారీరకంగా కొత్త ప్రాబ్లెమ్స్ వచ్చిపడతాయి. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనని అందరికీ తెలిసిందే.. […]

నిద్ర ఎక్కువైతే ముప్పే..
X

కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఈ సమ్మర్ లో ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు చాలామంది. దాంతో పగలు కూడా నిద్రపోవడం, రాత్రిళ్లు లేట్‌గా పడుకోవడం లేదా మేల్కొని ఉండడం లాంటివి చేస్తున్నారు. కానీ నిద్ర ఎప్పుడు, ఎంత ఉండాలో అంత ఉంటేనే మంచిది. లేకపోతే మానసికంగా, శారీరకంగా కొత్త ప్రాబ్లెమ్స్ వచ్చిపడతాయి.

నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనని అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల చేసేదేమీ లేక పోవాల్సినదానికంటే కాస్త ఎక్కువే నిద్ర పోతున్నారు. అయితే ఎక్కువగా నిద్ర పోవడం వల్ల రక్తంలో -రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్ ల్యూకేన్-లు పెరిగిపోయి బీపీ, టైప్-2 డయాబెటీస్‌‌తో పాటు గుండె సమస్యలు కూడా వస్తాయి. నిద్ర ఎక్కువైతే.. చిరాకు, కోపం, అసహనం లాంటివి కూడా పెరుగుతాయి. ముఖ్యంగా పగటి పూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల బరువు పెరగడం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే వయసుకు తగ్గట్టు నిద్రించే సమయాన్ని పాటించాలి. ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.

వయసుల వారీగా..
వయసుని బట్టి నిద్రపోయే టైంను ప్లాన్ చేసుకోవాలి. నాలుగు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలకు 11 నుంచి 12 గంటల వరకు నిద్ర అవసరం. ఐదు నుంచి ఎనిమిదేళ్ల వయసు పిల్లలు కనీసం పది గంటలైనా నిద్రపోవాలి. అలాగే ఎదిగే వయసులో ఉన్న పిల్లలు అంటే.. ఎనిమిది నుంచి పదేళ్ల వయసుండే పిల్లలు 9 నుంచి 10 గంటలు నిద్ర పోవాలి. టీనేజ్‌లో ఉన్న వాళ్లు 8 నుంచి 9 గంటలు, ఇరవై ఏళ్లు దాటిన వాళ్లు ఆరు నుంచి ఏడు గంటల వరకూ నిద్రపోవాలి. నిద్ర తక్కువైనా ఎక్కువైనా.. మెదడు నిలకడగా ఉండదు. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. అందుకే సరైన నిద్రకు సరైన సమయాన్ని కేటాయింకోవాలి.

First Published:  11 April 2021 9:20 AM IST
Next Story