Telugu Global
NEWS

హోం క్వారంటైన్ లో పవన్.. ప్రచారానికి దూరం..

పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా పాజిటివ్ నిర్థారణ కాకపోయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడమే. ఇటీవల పవన్ కల్యాణ్ తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఆ తర్వాత వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. సినిమా విడుదల తర్వాత ఆయన జనంలోకి రాలేదు, మిగతా నటీనటులు, టెక్నీషియన్లు, దర్శకుడు, నిర్మాత విజయోత్సవాల్లో ఉంటే, […]

హోం క్వారంటైన్ లో పవన్.. ప్రచారానికి దూరం..
X

పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా పాజిటివ్ నిర్థారణ కాకపోయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడమే. ఇటీవల పవన్ కల్యాణ్ తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఆ తర్వాత వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. సినిమా విడుదల తర్వాత ఆయన జనంలోకి రాలేదు, మిగతా నటీనటులు, టెక్నీషియన్లు, దర్శకుడు, నిర్మాత విజయోత్సవాల్లో ఉంటే, పవన్ మాత్రం ఆ హడావిడికి దూరంగా ఉన్నారు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు సందేశం ఇవ్వలేదు. సినిమా విడుదలైన తర్వాత పవన్ కల్యాణ్ ని ఎవరూ కలవలేదు కూడా. హోం క్వారంటైన్లో ఉన్నందుకే పవన్ ఎవర్నీ కలవడానికి ఆసక్తి చూపలేదని తాజా సమాచారం.

ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ప్రధాన పాత్రధారి నివేదా థామస్ కూడా ఇటీవలే కరోనాబారిన పడ్డారు. ఏప్రిల్ 3న తనకు కరోనా సోకినట్టు ప్రకటించిన ఆమె, ఆ తర్వాత అందరికీ సోషల్ మీడియా ద్వారా జాగ్రత్తలు చెబుతూ వచ్చారు. అయితే సినిమా విడుదలైన 9వతేదీ సడన్ గా థియేటర్లో ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చారు. హోం క్వారంటైన్ పూర్తికాకముందే నివేదా థియేటర్లోకి ఎందుకొచ్చారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

ఇక పవన్ కల్యాణ్ మాత్రం తనకి కరోనా పాజిటివ్ తేలక పోయినా, తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ రావడంతో వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. దీంతో ఆయన అటు సినిమా ప్రచారానికి కానీ, ఇటు రాజకీయ ప్రచారానికి కానీ రాలేని పరిస్థితి. వాస్తవానికి ఈనెల 12న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతి లోక్ సభ పరిధిలో పాల్గొనే బహిరంగ సభలకు జనసేనాని కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ పవన్ హోమ్ క్వారంటైన్ తో ఆ టూర్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీ వ్యవహారాలన్నిటినీ వర్చువల్ విధానంలోనే పర్యవేక్షిస్తున్నారు.

First Published:  11 April 2021 9:06 AM IST
Next Story