Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్-కొరటాల సినిమా ఫిక్స్

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా లాక్ అయింది. ఈ మేరకు రేపు దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ ను నిర్మాతగా పరిచయం చేస్తూ, తను కూడా సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ..కొరటాల ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తారక్-కొరటాల మధ్య ఆల్రెడీ కథా చర్చలు పూర్తయ్యాయట. ప్రస్తుతం ఆచార్య సినిమా పనిమీద బిజీగా ఉన్నాడు కొరటాల. అటు ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కొలిక్కి వచ్చిన […]

ఎన్టీఆర్-కొరటాల సినిమా ఫిక్స్
X

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా లాక్ అయింది. ఈ మేరకు రేపు దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. తన
మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ ను నిర్మాతగా పరిచయం చేస్తూ, తను కూడా సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ..కొరటాల ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తారక్-కొరటాల మధ్య ఆల్రెడీ కథా చర్చలు పూర్తయ్యాయట.

ప్రస్తుతం ఆచార్య సినిమా పనిమీద బిజీగా ఉన్నాడు కొరటాల. అటు ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో
బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కొలిక్కి వచ్చిన వెంటనే కొరటాల-ఎన్టీఆర్ సినిమా
మొదలవుతుంది. కొరటాల శైలిలో ఇది కూడా సందేశాత్మకంగానే ఉండబోతోంది.

ఇంతకుముందు కొరటాల-ఎన్టీఆర్ కలిసి జనతా గ్యారేజ్ అనే సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా
హిట్టవ్వడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మొక్కలు పెంచాలి, ప్రకృతిని
కాపాడుకోవాలనే గొప్ప సందేశాన్ని అందులో ఇచ్చారు. ఈసారి కూడా ఎన్టీఆర్-కొరటాల కలిసి మరో
సందేశంతో కమర్షియల్ సినిమా తీయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రేపు తెలిసే
ఛాన్స్ ఉంది.

First Published:  11 April 2021 1:23 PM IST
Next Story