నాకు కరోనా తగ్గిపోయింది
హీరోయిన్ నివేత థామస్ పై నిన్నంతా భారీగా ట్రోలింగ్ జరిగింది. వారం రోజుల కిందట తనకు కరోనా సోకిందని ప్రకటించిన ఈ ముద్దగుమ్మ, సడెన్ గా వకీల్ సాబ్ సినిమా థియేటర్ లో ప్రత్యక్షమైంది. ఆమె సినిమా చూస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. దీంతో ఆమెపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తనపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరగడంతో నివేత స్పందించింది. తనకు కరోనా లేదని ఆమె స్పష్టంచేసింది. “కరెక్ట్ గా ప్రమోషన్ […]
హీరోయిన్ నివేత థామస్ పై నిన్నంతా భారీగా ట్రోలింగ్ జరిగింది. వారం రోజుల కిందట తనకు కరోనా
సోకిందని ప్రకటించిన ఈ ముద్దగుమ్మ, సడెన్ గా వకీల్ సాబ్ సినిమా థియేటర్ లో ప్రత్యక్షమైంది. ఆమె
సినిమా చూస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. దీంతో ఆమెపై చాలామంది ఆగ్రహం వ్యక్తం
చేశారు. ఇలా తనపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరగడంతో నివేత స్పందించింది. తనకు కరోనా లేదని ఆమె
స్పష్టంచేసింది.
“కరెక్ట్ గా ప్రమోషన్ టైమ్ లో నాకు కొవిడ్ రావడం కొంత బాధగా అనిపించింది. అయితే రైట్ టైమ్ కు
నాకు మళ్లీ నెగిటివ్ వచ్చింది. థియేటర్ కు వెళ్లి సినిమా చూద్దామని అనుకున్నాను. ఎప్పటిలా ఆరోగ్యంగా
కావాలంటే బయట తిరగకుండా ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దాంతో
ఆగిపోయాను. నాకు మాత్రం ఒక్కసారి బయటకు వెళ్లి థియేటర్లలో ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో
చూడాలని అనిపించింది.”
ఇలా తనకు కరోనా తగ్గిన విషయాన్ని బయటపెట్టింది నివేత. కేవలం ప్రేక్షకుల రెస్పాన్స్ చూసేందుకే
తను థియేటర్ కు వెళ్లానని, ఎవ్వర్నీ టచ్ చేయకుండా దూరంగా నిలబడి ప్రేక్షకుల స్పందన చూసి
ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది.