క్వారంటైన్ లో కత్రిన ఏం చేస్తోంది?
బాలీవుడ్ ను కరోనా పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లంతా ఒకరి తర్వాత ఒకరుగా కరోనా బారిన పడుతున్నాడు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మరి క్వారంటైన్ లో ఉన్న కత్రినా కైఫ్ ఏం చేస్తోంది? దీనికి స్వయంగా కత్రినా కైఫ్ సమాధానం ఇస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న కత్రినాకైఫ్.. సెల్ఫీ దిగింది. తను సెల్ఫీ తీసుకున్న 2 ఫొటోల్ని సోషల్ మీడియాలో పెట్టింది. దీనికి క్యాప్షన్ గా […]
బాలీవుడ్ ను కరోనా పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లంతా ఒకరి తర్వాత ఒకరుగా కరోనా
బారిన పడుతున్నాడు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ కూడా కరోనా బారిన పడిన సంగతి
తెలిసిందే. మరి క్వారంటైన్ లో ఉన్న కత్రినా కైఫ్ ఏం చేస్తోంది? దీనికి స్వయంగా కత్రినా కైఫ్ సమాధానం
ఇస్తోంది.
ఇంట్లో ఒంటరిగా ఉన్న కత్రినాకైఫ్.. సెల్ఫీ దిగింది. తను సెల్ఫీ తీసుకున్న 2 ఫొటోల్ని సోషల్ మీడియాలో పెట్టింది. దీనికి క్యాప్షన్ గా టైమ్ అండ్ పేషెన్స్ అనే టైటిల్ పెట్టింది. దీన్ని నెటిజన్లు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు. రోజూ బిజీగా ఉండే కత్రినాకైఫ్ కు ఇన్నాళ్లకు టైమ్ దొరికిందని ప్రస్తుతం ఆమె తన సొంత టైమ్ ను ఎంజాయ్ చేస్తోందని అన్నారు.
మరికొందరు మాత్రం ఈ టైమ్ లో ఇలా ఖాళీగా ఉండడం కత్రినాకు చాలా బోర్ కొడుతోందని, అందుకే
సహనం అనే పదాన్ని వాడిందని అంటున్నారు. వీళ్ల వాదనల సంగతి పక్కనపెడితే.. ఎలాంటి మేకప్
లేకుండా కత్రినా దిగిన సెల్ఫీలు ఇప్పుడు అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆమె ముఖం చాలా
సహజంగా ఉందంటూ కామెంట్స్ పడుతున్నాయి