సారంగ దరియా పేరడి విన్నారా.. కుడి భుజం మీద టీకా..
లవ్ స్టోరీ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన సారంగ దిరయా పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆ పాటకు పేరడీ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వారి కుడి భుజం మీద టీకా.. అంటూ సాగే ఈ పాట.. మస్త్ పాపులర్ అవుతోంది. వ్యాక్సిన్ పై జనాల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పేరడీ చేసిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుడి భుజం […]
లవ్ స్టోరీ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన సారంగ దిరయా పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆ పాటకు పేరడీ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వారి కుడి భుజం మీద టీకా.. అంటూ సాగే ఈ పాట.. మస్త్ పాపులర్ అవుతోంది. వ్యాక్సిన్ పై జనాల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పేరడీ చేసిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుడి భుజం మీద టీకా.. మీరు వేసుకొనుటకిది మోకా.. వ్యాధి రమ్మన్న రాదురా కాకా.. దాని పేరే కోవిడ్ టీకా అంటూ సాగే ఈ పాటను వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం గూనపర్తి గ్రామానికి చెందిన ముత్యాల రఘుపతి రాశారు. గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయిన ఈయన చాలామంది టీకాపై అపోహలతో వేయించుకోవడం లేదని తెలిసి అలాంటి వారిలో అవగాహన కల్పించడం కోసం ఈ పేరడి పాట రాసినట్టు చెప్పారు. యూట్యూబ్ లో.. “సారంగ దరియా పేరడీ ఆన్ కోవిడ్ వ్యాక్సిన్ అవేర్ నెస్” అని టైప్ చేస్తే ఈ సాంగ్ వస్తుంది. మస్త్ పాపులర్ అవుతున్న ఈ సాంగ్ లిరిక్స్ ఇవే..
పల్లవి:
వారి కుడి భుజం మీద టీకా
మీరు వేసుకొనుడికిది మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిట్ టీకా
చరణం:
మక్కుకి కాటన్ మాస్కుల్
లేకున్నా బతుకులు ముష్కిల్
చేతికి ప్లాస్టిక్ గ్లౌజుల్
లేకున్నా ఉంటయ్ రిస్కుల్
అడుగడుగున కోవిడ్ ఆంక్షల్
పాటిస్తే ఉండవు చావుల్
ఒంట్లో మజిల్స్ నొప్పుల్
లేకున్న జ్వరము నిప్పుల్
దివి కంటితో చూడగా తప్పుల్
తుర్రున పోతయిరా ముప్పుల్
టీకా.. టీకా.. టీకా
ఇది కరోనా కట్టడి మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా