Telugu Global
Health & Life Style

కరోనా సోకిన వారిని కలిస్తే ఏం చేయాలి?

కరోనా సెకండ్ వేవ్ లో రోజుకి లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి వైరస్ సోకుతుందో చెప్పలేం. ఇలాంటి సమయంలో మనం రీసెంట్‌గా కలిసిన వాళ్లకు లేదా ఫ్రెండ్స్‌లో ఎవరికైనా సడెన్‌గా కరోనా పాజిటివ్ అన్న న్యూస్ మనల్ని భయపెట్టొచ్చు. మరలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? రీసెంట్‌గా కలిసిన వాళ్లకు లేదా ఫ్రెండ్స్ కు పాజిటివ్ అని తెలియగానే వెంటనే భయపడిపోతుంటారు చాలామంది. వాళ్లను కలిశాం కాబట్టి మనకు కూడా వచ్చేస్తుందేమో […]

కరోనా సోకిన వారిని కలిస్తే ఏం చేయాలి?
X

కరోనా సెకండ్ వేవ్ లో రోజుకి లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి వైరస్ సోకుతుందో చెప్పలేం. ఇలాంటి సమయంలో మనం రీసెంట్‌గా కలిసిన వాళ్లకు లేదా ఫ్రెండ్స్‌లో ఎవరికైనా సడెన్‌గా కరోనా పాజిటివ్ అన్న న్యూస్ మనల్ని భయపెట్టొచ్చు.

మరలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి?
రీసెంట్‌గా కలిసిన వాళ్లకు లేదా ఫ్రెండ్స్ కు పాజిటివ్ అని తెలియగానే వెంటనే భయపడిపోతుంటారు చాలామంది. వాళ్లను కలిశాం కాబట్టి మనకు కూడా వచ్చేస్తుందేమో అని టెన్షన్ పడుతుంటారు. కొంతమంది డిప్రెషన్‌తో, భయంతో కంగారు పడుతుంటారు. అయితే సోకిన వారిని కలిసినంత మాత్రాన మనకు కూడా సోకుతుందని కానీ, సోకదని కానీ కచ్చితంగా చెప్పలేం. అందుకే టెన్షన్ పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచించడం ముఖ్యం.

ఇలా చేయాలి
రీసెంట్‌గా కలిసిన వాళ్లకు వైరస్ పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలి. సోకిన వాళ్లని కలిసిన రోజు వేసుకున్న బట్టలు లేదా బ్యాగ్స్ లాంటి వాటిని ఇంట్లో ఉంచకుండా సెపరేట్‌గా ఉంచడం లేదా ఉతికి ఆరేయడం, శానిటైజ్ చేయడం లాంటివి చేయాలి.
వైరస్ మనకు కూడా సోకిందో లేదో తెలుసుకోడానికి వీలైనంత త్వరగా టెస్ట్ చేయించుకోవాలి. అప్పటివరకూ కంగారు పడకుండా ధైర్యంగా ఉండాలి. సరైన ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి.
టెస్ట్ నెగెటివ్ వచ్చేవరకూ.. ఇంట్లో ఎవ్వరినీ ముట్టుకోకుండా సెపెరేట్ రూంలో ఉండాలి. ఇంట్లో వాళ్లని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఇంటికి ఎవ్వరినీ రావ్వొద్దని చెప్పాలి.

పాజిటివ్ వచ్చినా లేదా టెస్ట్ చేయించుకోవడం కుదరకపోయినా.. భయపడకుండా ఇంట్లోనే హెల్దీగా ఉండాలి. ఇమ్యూనిటీని పెంచే వాటిని తీసుకోవడం,ఫ్రూట్స్ ఎక్కువగా తినడం చేస్తుండాలి. సింప్టమ్స్‌ని ట్రాక్ చేసేందుకు బాడీ టెంపరేచర్ ఇంకా పల్స్‌రేట్ లాంటివి రోజూ చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది.
ఇలా రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉంటూ.. ఎలాంటి సింప్టమ్స్ కనిపించకపోతే మనం సేఫ్‌ అని అర్థం. ఇంట్లోనే ఉంటూ చాలామంది కోలుకుంటున్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. అన్నింటికంటే ముఖ్యంగా మన నుంచి మరొకరికి సోకకుండా జాగ్రత్తగా ఉండాలి.

First Published:  10 April 2021 2:59 AM GMT
Next Story