Telugu Global
Cinema & Entertainment

ఆ టైటిల్ ఏంటి "బామ్మర్ది"

కొన్ని సినిమా టైటిల్స్ ఫన్నీగా ఉంటాయి. ఆ టైటిల్స్ సినిమాకు ప్లస్ అవుతాయా, మైనస్ అవుతాయా అనే విషయాన్ని పక్కనపెడితే.. సినిమాకు ప్రచారం కల్పించడానికి మాత్రం బాగా పనికొస్తాయి. అయితే రాంగ్ టైటిల్స్ వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిలాంటిదే ఓ సినిమా టైటిల్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ సినిమా పేరు ఒరేయ్ బామ్మర్ది లవర్ బాయ్ గా పలు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న సిద్ధార్థ్ , సంగీత దర్శకుడిగా […]

ఆ టైటిల్ ఏంటి బామ్మర్ది
X

కొన్ని సినిమా టైటిల్స్ ఫన్నీగా ఉంటాయి. ఆ టైటిల్స్ సినిమాకు ప్లస్ అవుతాయా, మైనస్ అవుతాయా
అనే విషయాన్ని పక్కనపెడితే.. సినిమాకు ప్రచారం కల్పించడానికి మాత్రం బాగా పనికొస్తాయి. అయితే
రాంగ్ టైటిల్స్ వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిలాంటిదే ఓ సినిమా టైటిల్ తో
అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ సినిమా పేరు ఒరేయ్ బామ్మర్ది

లవర్ బాయ్ గా పలు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న సిద్ధార్థ్ , సంగీత దర్శకుడిగా మంచి
పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న జీవీ ప్రకాష్ కుమార్ లు హీరోలుగా బిచ్చగాడు లాంటి సూపర్ హిట్
చిత్రాన్ని తెరకెక్కించిన శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఒరేయ్ బామ్మర్ది’. కశ్మీర పరదేశి, లిజోమోల్
జోస్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు.. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్
సినిమా కి రమేష్ పి పిళ్లై నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.

ఒకేసారి టైటిల్ తో పాటు సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో జీవీ ప్రకాష్ బైక్ రేసర్ గా
కనిపిస్తున్నాడు. ఇక సిద్దార్థ్ ట్రాఫిక్ ఎస్ఐగా నటించాడు. వీళ్లిద్దరి మధ్య జరిగే యాక్షన్ సంఘటనల
నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతోంది.

కానీ ఈ టీజర్ కు ఒరేయ్ బామ్మర్ది అనే టైటిల్ కు సంబంధం ఏంటనే విషయం ఎంత ఆలోచించినా
తట్టడం లేదు. సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా కనెక్షన్ ఉంటే ఓకే, లేదంటే కేవలం ప్రచారం కోసమే
ఇలాంటి టైటిల్ పెట్టారనుకోవాలి.

First Published:  10 April 2021 11:07 AM IST
Next Story