Telugu Global
NEWS

తిరుపతి రాలేను గురుమూర్తిని గెలిపించండి.. సీఎం జగన్​ లేఖ..!

ఏపీ సీఎం జగన్మోహన్​ రెడ్డి తిరుపతి పర్యటన రద్దైయింది. కరోనా కారణంగా తాను తిరుపతికి రాలేకపోతున్నానని జగన్​ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి పార్లమెంట్​ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్​ తిరుపతిలో పర్యటించి బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. కానీ పెరుగుతున్న కరోనా కేసులతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను తిరుపతి రాలేకపోతున్నానని.. ఎందుకంటే గత […]

తిరుపతి రాలేను గురుమూర్తిని గెలిపించండి.. సీఎం జగన్​ లేఖ..!
X

ఏపీ సీఎం జగన్మోహన్​ రెడ్డి తిరుపతి పర్యటన రద్దైయింది. కరోనా కారణంగా తాను తిరుపతికి రాలేకపోతున్నానని జగన్​ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి పార్లమెంట్​ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్​ తిరుపతిలో పర్యటించి బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. కానీ పెరుగుతున్న కరోనా కేసులతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను తిరుపతి రాలేకపోతున్నానని.. ఎందుకంటే గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాక 11 మంది మృతిచెందారు. అందులో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లే. నెల్లూరు జిల్లాలో ఒక్కరోజులోనే 292 కేసులు వచ్చాయి. నేను బహిరంగ సభ నిర్వహిస్తే వేలాదిగా ప్రజలు తరలివస్తారు. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. అందుకే పర్యటన రద్దు చేసుకున్నాను. మీరంతా నా వాళ్లు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ సీఎం జగన్​ ప్రజలకు లేఖ రాశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు చూసి తమకు ఓటు వేయాలని ఆయన కోరారు. తిరుపతిలో ఇప్పటికే ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంట్​ సెగ్మెంట్​లో పర్యటిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరఫున పవన్​ కల్యాణ్​ కూడా ప్రచారం నిర్వహించారు. ఇదిలా ఉంటే సీఎం జగన్​ కూడా వస్తే బాగుంటుందని వైసీపీ శ్రేణులు భావించాయి. కానీ కరోనా కారణంగా ఆయన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

ఇదిలా ఉంటే తిరుపతి పార్లమెంట్​ పరిధిలో వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. వైసీపీ నేతలు మెజార్టీ పైనే దృష్టి సారించారు. ఇక బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కొత్త వ్యక్తి. పైగా బీజేపీకి అక్కడ అసలు క్యాడరే లేదు. దీనికి తోడు తమకు టికెట్​ దక్కనందున జనసైనికులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇక చంద్రబాబు తిరుపతి పార్లమెంట్​ పరిధిలో పర్యటిస్తున్నారు. ఎలాగైనా చెప్పుకోదగ్గ ఓట్లు సాధించి ఉనికిని కాపాడుకోవాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ వ్యూహాత్మకంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

First Published:  10 April 2021 3:49 PM IST
Next Story