Telugu Global
National

వ్యాక్సిన్స్ అవుట్ ఆఫ్ స్టాక్

ఒకపక్క దేశంలో కరోనా కేసులు పెరుగుతూ పోతుంటే.. మరో పక్క వ్యాక్సిన్స్ నిల్వలు తగ్గుతూపోతున్నాయి. చాలా చోట్ల ఇప్పుడు వ్యాక్సిన్స్ అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాల కొరత వేధిస్తుంది. వ్యాక్సిన్స్ కొరత కారణంగా వారణాసిలోని 62 శాతం వ్యాక్సినేషన్ సెంటర్లను మూసివేయాల్సి వచ్చింది. అలాగే టీకా డోసులు అయిపోయాయని అర్జెంట్ గా 20 లక్షల డోసులు పంపాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. […]

వ్యాక్సిన్స్ అవుట్ ఆఫ్ స్టాక్
X

ఒకపక్క దేశంలో కరోనా కేసులు పెరుగుతూ పోతుంటే.. మరో పక్క వ్యాక్సిన్స్ నిల్వలు తగ్గుతూపోతున్నాయి. చాలా చోట్ల ఇప్పుడు వ్యాక్సిన్స్ అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాల కొరత వేధిస్తుంది. వ్యాక్సిన్స్ కొరత కారణంగా వారణాసిలోని 62 శాతం వ్యాక్సినేషన్ సెంటర్లను మూసివేయాల్సి వచ్చింది. అలాగే టీకా డోసులు అయిపోయాయని అర్జెంట్ గా 20 లక్షల డోసులు పంపాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అలాగే ఏపీలో కూడా డోసులు అయిపోయాయని వెంటనే కోటి డోసులు కావాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

ఇకపోతే మహారాష్ట్రలో కూడా వ్యాక్సిన్‌ కొరత బాగానే ఉంది. పైగా మహారాష్ట్రకు తక్కువగా డోసుల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం వాపోతుంది.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, యూపీతో పోలిస్తే తమకు తక్కువ వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేస్తున్నారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్నారు. దీంతో టీకా డోసులు లేక శుక్రవారం నుంచి వ్యాక్సినేషన్‌ను నిలిపేస్తున్నట్టు ముంబై మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా వ్యాక్సినేషన్‌ లో భారత్‌ ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో రోజుకు సగటున 34,30,502 టీకా డోసుల చొప్పున ఇప్పటివరకూ 9,01,98,673 వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చినట్టు పేర్కొంది.

First Published:  9 April 2021 3:21 AM GMT
Next Story