Telugu Global
Sports

ఈ సారి ఐపీయల్ ఎలా ఉండబోతుందంటే..

కరోనా పుణ్యమా అని పోయిన ఐపీయల్.. అభిమానుల సందడి లేకుండానే జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న కారణంగా ఈ సారి కూడా ఆడియెన్స్ లేకుండా.. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదలవ్వబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ క్రేజ్ సంపాదించిన ఐపీయల్ మరోసారి క్రికెట్ లవర్స్ ను మెప్పించడానికి సిద్ధమైంది. ఈ రోజ చెన్నైలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌-రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు […]

ఈ సారి ఐపీయల్ ఎలా ఉండబోతుందంటే..
X

కరోనా పుణ్యమా అని పోయిన ఐపీయల్.. అభిమానుల సందడి లేకుండానే జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న కారణంగా ఈ సారి కూడా ఆడియెన్స్ లేకుండా.. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొదలవ్వబోతోంది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ క్రేజ్ సంపాదించిన ఐపీయల్ మరోసారి క్రికెట్ లవర్స్ ను మెప్పించడానికి సిద్ధమైంది. ఈ రోజ చెన్నైలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌-రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి.

ఎప్పుడు ఏమవుతుందో..
నేటి మొదలు మే 30 వరకు ఎనిమిది జట్ల మధ్య 50 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అయితే కరోనా కారణంగా ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి కూడా మరోవైపు భయపెడుతుంది. ఆటగాళ్లకు కరోనా సోకిన కారణంగా గతంలో కొన్ని ఇతర దేశాల ప్రీమియర్ లీగ్ లు నిలిపివేయాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులు ఐపీయల్ రాకుండా బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా భయం భయంగానే సీజన్ మొదలవుతున్నట్టు తెలుస్తోంది.

కరోనా భయంతో..
ఇదిలా ఉంటే మరోపక్క నితిశ్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, దేవ్‌దత్‌, డానియల్‌ శామ్స్‌ లాంటి ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. అలాగే ముంబైలోని వాంఖడే స్టేడియం స్టాఫ్ కూడా కరోనా బాధితులయ్యారు. వీరందర్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందీ లేకుండా మ్యాచ్ లు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.

కట్టుదిట్టంగా ప్లాన్
ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లంతా 15 రోజులు ముందునుంచే బయో సెక్యూర్‌ బబుల్‌లో ఉంటున్నారు. టోర్నీ ముగిసేవరకు కూడా వారంతా బబుల్‌లో ఉంటారు. ఈసారి కూడా ప్రేక్షకులకు అనుమతి లేదు. ఆరంభ వేడుకలూ లేవు. ఈ సీజన్‌ కేవలం ఆరు నగరాల్లోనే జరుగనుంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై ల్లోనే మొత్తం 60 మ్యాచ్‌లు జరుగుతాయి.

గెలుపెవరిదో..
2016లో సన్‌రైజర్స్‌ గెలిచిన తర్వాత వరుసగా ముంబై మూడుసార్లు, చెన్నై ఓసారి టైటిల్‌ గెలిచింది. ఎప్పటి నుంచో కప్పు కోసం వెయిట్ చేస్తున్న కోహ్లీ సేన, పోయిన సారి పోగొట్టుకున్న ప్రాభవాన్ని తిరిగి అందుకోవాలని ధోని సేన.. ఎప్పటిలాగే.. క్రేజ్ ను కంటిన్యూ చేయాలన్న ముంబై సేనలు ఈ సారి ఏ మేరకు పోటీపడతాయో చూడాలి. అలాగా ఇప్పటి వరకూ కప్పు గెలవని ఢిల్లీ, పంజాబ్‌ కూడా ఎంతమేరకు రాణిస్తాయో వేచి చూడాలి.

First Published:  9 April 2021 9:11 AM IST
Next Story