వకీల్ సాబ్ విడుదలకు సర్వం సిద్ధం
పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. సోలో రిలీజ్ కావడం, ఆల్రెడీ థియేటర్లలో ఉన్న సినిమాలేవీ పెద్దగా ఆడకపోవడంతో.. వకీల్ సాబ్ కు లెక్కలేనన్ని థియేటర్లు దొరికాయి. ప్రస్తుతానికి అందిన లెక్కల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లోనే రేపు 800 షోలు వేయబోతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే.. నైజాంలో […]
పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా
ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో థియేటర్లు
అందుబాటులోకి వచ్చాయి. సోలో రిలీజ్ కావడం, ఆల్రెడీ థియేటర్లలో ఉన్న సినిమాలేవీ పెద్దగా
ఆడకపోవడంతో.. వకీల్ సాబ్ కు లెక్కలేనన్ని థియేటర్లు దొరికాయి.
ప్రస్తుతానికి అందిన లెక్కల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లోనే రేపు 800 షోలు వేయబోతున్నారు. ఓవరాల్
గా చూసుకుంటే.. నైజాంలో ఇప్పటివరకు ఏ హీరోకు దక్కని స్క్రీన్స్ వకీల్ సాబ్ కు దొరికాయి. ఇంకా
చెప్పాలంటే ప్రతి 3 స్క్రీన్స్ లో ఒక స్క్రీన్ వకీల్ సాబ్ దే. ఇటు ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి.
ఇక కరోనా భయాల్ని లెక్కచేయకుండా అటు అధికారులు ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి
ఇచ్చారు. ఇటు ప్రేక్షకులు కూడా ఎలాంటి భయాలు పెట్టుకోకుండా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు.
ఏపీ,నైజాంలో రేపు ఉదయం 4.30 నుంచే వకీల్ సాబ్ షోలు పడబోతున్నాయి.
అటు ఓవర్సీస్ లో కూడా వకీల్ సాబ్ హవా నడుస్తోంది. ఏకంగా 285కు పైగా స్క్రీన్స్ లో వకీల్ సాబ్
ప్రీమియర్ ప్లాన్ చేశారు. మరికొద్దిసేపట్లో ఆ ప్రీమియర్స్ మొదలవుతాయి.