Telugu Global
Cinema & Entertainment

ఫిట్ నెస్ పై రకుల్ ప్రీత్ పాఠాలు

హీరోయిన్లంతా ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తారు. అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంకాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఫిట్ నెస్ తర్వాతే ఏదైనా అంటుంది. సొంతంగా జిమ్స్ కూడా మెయింటైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఫిట్ నెస్ కు సంబంధించి రకుల్ కొన్ని సూచనలు సలహాలు ఇస్తోంది. ఎవర్నో చూసి ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు మార్చుకోవద్దని సూచిస్తోంది రకుల్. మన శరీరంపై అవగాహన మనకే ఉంటుందని.. శరీరానికి తగ్గట్టు […]

ఫిట్ నెస్ పై రకుల్ ప్రీత్ పాఠాలు
X

హీరోయిన్లంతా ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తారు. అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంకాస్త ఎక్కువ
ప్రాధాన్యం ఇస్తుంది. ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఫిట్ నెస్ తర్వాతే ఏదైనా అంటుంది. సొంతంగా జిమ్స్ కూడా మెయింటైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఫిట్ నెస్ కు సంబంధించి రకుల్ కొన్ని సూచనలు సలహాలు ఇస్తోంది.

ఎవర్నో చూసి ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు మార్చుకోవద్దని సూచిస్తోంది రకుల్. మన శరీరంపై
అవగాహన మనకే ఉంటుందని.. శరీరానికి తగ్గట్టు అలవాట్లు, వ్యాయామాలు ఎంచుకోవాలని సూచిస్తోంది.
వ్యాయామాన్ని ఓ పనిగా కాకుండా లైఫ్ స్టయిల్ గా మార్చుకున్నప్పుడే ఫిట్ నెస్ వస్తుందని చెబుతోంది.
తప్పనిసరిగా ఎక్సర్ సైజ్ చేయాలనే ఆలోచన కంటే ఇష్టంగా ఎక్సర్ సైజ్ చేయాలనే ఆలోచన
ఉత్సాహాన్నిస్తుందని చెబుతోంది.

ఇక వ్యాయామానికి యోగాను కూడా జతచేస్తే మంచి ఫలితాలు సాధించొచ్చని చెబుతోంది రకుల్. ఏదీ
అతిగా చేయకూడదని, చేసేవి 2-3 వ్యాయామాలైనా ఇష్టంగా చేయాలని చెబుతోంది. కడుపు నిండా
తినడం, కెలొరీలు కరిగేలా వ్యాయామం చేయడం, కంటినిండా నిద్రపోవడం తన ఫిట్ నెస్ సీక్రెట్ అని
చెబుతోంది ఈ మెరుపుతీగ.

First Published:  8 April 2021 3:08 PM IST
Next Story