సందడి లేని పరిషత్ సంబరం..
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. నామినేషన్లు, ఉపసంహరణలు, ఏకగ్రీవాలు.. అన్నీ గతంలోనే పూర్తయి పోవడం, కేవలం ఓటింగ్ మాత్రమే ఇప్పుడు మొదలు కావడంతో అసలు ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్నట్టుగా వాతావరణం ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, పోటీనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో.. అధికార పక్షం వైసీపీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా పెద్దగా ప్రచారానికి ప్రయాస పడలేదు. ఓటర్లు కూడా నింపాదిగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్నారు. దాదాపుగా రాష్ట్రంలో ఎక్కడా బారులు […]
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. నామినేషన్లు, ఉపసంహరణలు, ఏకగ్రీవాలు.. అన్నీ గతంలోనే పూర్తయి పోవడం, కేవలం ఓటింగ్ మాత్రమే ఇప్పుడు మొదలు కావడంతో అసలు ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్నట్టుగా వాతావరణం ఉంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, పోటీనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో.. అధికార పక్షం వైసీపీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా పెద్దగా ప్రచారానికి ప్రయాస పడలేదు. ఓటర్లు కూడా నింపాదిగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్నారు. దాదాపుగా రాష్ట్రంలో ఎక్కడా బారులు తీరిన ఓటర్లు అన్న మాటే వినిపించలేదు.
టీడీపీ బూత్ ఏజెంట్లను కూడా నియమించలేదు. అధినేత చంద్రబాబు మాట ప్రకారం దాదాపుగా ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించినట్టేనని చెప్పాలి. దీంతో ఎన్నికల సందడి పూర్తిగా తగ్గిపోయింది. ఎన్నికలను నిలిపివేసినట్టుగా మంగళవారం హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం, బుధవారం మధ్యాహ్నం వరకు ఎన్నికలపై ఎడతెగని ఉత్కంఠ నెలకొనడంతో చాలామందికి ఈరోజు పోలింగ్ పై సందేహాలున్నాయి. దీంతో ఉదయాన్నే పోలింగ్ కి ఎవరూ ముందుకు రాలేదు. దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగితే.. పరిషత్ ఎన్నికల్లో 50శాతం పోలింగ్ నమోదు కావడం కూడా కష్టమేనని అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సుమారు 2,44,71,002 మంది గ్రామీణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.