కరోనా కొత్త లక్షణాలు ఇవే..
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా సెకండ్ వేవ్ గడగడలాడిస్తోంది. లక్షల సంఖ్యలో కేసులతో పాటు మరణాలు కూడా పెరగడం ఆందోళన రేపుతోంది. అయితే కాలంతో పాటే వైరస్ కూడా అప్ డేట్ అయింది. ఇప్పుడు వస్తున్న వేరియంట్లు కొత్త లక్షణాలు చూపిస్తున్నాయి. మునుపటిలా దగ్గు, జలుబు మాత్రమే కాదు, ఇప్పుడు మరికొన్ని కొత్తలక్షణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే.. కరోనా సెకండ్ వేవ్‌లో ఇన్ఫెక్షన్లు, కేసులు పెరుగుతున్నాయి. ఈ సెకండ్ వేవ్‌ను అంత తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు […]
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా సెకండ్ వేవ్ గడగడలాడిస్తోంది. లక్షల సంఖ్యలో కేసులతో పాటు మరణాలు కూడా పెరగడం ఆందోళన రేపుతోంది. అయితే కాలంతో పాటే వైరస్ కూడా అప్ డేట్ అయింది. ఇప్పుడు వస్తున్న వేరియంట్లు కొత్త లక్షణాలు చూపిస్తున్నాయి. మునుపటిలా దగ్గు, జలుబు మాత్రమే కాదు, ఇప్పుడు మరికొన్ని కొత్తలక్షణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే..
కరోనా సెకండ్ వేవ్‌లో ఇన్ఫెక్షన్లు, కేసులు పెరుగుతున్నాయి. ఈ సెకండ్ వేవ్‌ను అంత తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు సోకుతున్న వైరస్ తీవ్రత మొదటిదానికంటే ఎక్కువగా ఉంటోంది. ఈ వైరస్ ను జలుబు, లాంటి లక్షణాలతో పాటు కొన్ని కొత్త లక్షణాలతో కూడా గుర్తించొచ్చు.
ఇప్పటివరకు కోవిడ్-19 సాధారణ లక్షణాలు జలుబు, పొడిదగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, వాసన, రుచిని కోల్పోవడం, చలిగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపించేవి. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న సెకండ్ వేవ్‌లో ముఖ్యంగా మూడు కొత్త లక్షణాలను గుర్తించారు.
ఎర్రటి కళ్లు
కొన్ని అధ్యయనాల ప్రకారం, ఎర్రటి కళ్లు లేదా కళ్లకలకలు కూడా అనేది కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌కు సంకేతంగా చూడొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. కళ్లు మండుతూ ఎర్రగా మారడం, కంటి వాపు , కంటి నుంచి నీరు కారడం లాంటివి కూడా కరోనా సంకేతాలుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
వినికిడి లోపం
ఉన్నట్టుండి వినికిడి లోపాన్ని గమనించినట్లయితే.. అది కూడా కరోనా లక్షణంగా భావించొచ్చని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీ చెప్తోంది. కొంతమందిలో కోవిడ్-19.. వినికిడి సమస్యలకు కూడా దారితీస్తుందని డాక్టర్లు గుర్తించారు.
జీర్ణ సమస్యలు
కోవిడ్ సోకిన కొంతమందిలో జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తున్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఓ కొత్త అధ్యయనం ప్రకారం.. అతిసారం, వాంతులు, పొట్టలో తిమ్మిరి, వికారం, కడుపు నొప్పి లాంటివి కరోనా సంకేతాలుగా చెప్పొచ్చు.
ఇలాంటి లక్షణాలు ఉన్నట్టుండి గుర్తిస్తే.. వెంటనే జాగ్రత్త పడడం మంచిది. టెస్ట్ చేయించుకోవడం లేదా ఇంటిలోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెపరేట్ గా ఉండడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.