భారతీయ పెట్రోలియం రంగంలో మేఘా సరికొత్త అధ్యాయం..
భారతీయ పెట్రోలియం రంగంలోనే మేఘా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులు ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ రంగంలోనే తయారవుతుండేవి. అయితే తొలిసారిగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు రంగంలో ఈ రిగ్గులను తయారు చేసింది మేఘా సంస్థ. గుజరాత్ లోని అహ్మదాబాద్ కలోల్ చమురు క్షేత్రంలో ఈ రిగ్గు ద్వారా లాంఛనంగా పని మొదలు పెట్టారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే […]
భారతీయ పెట్రోలియం రంగంలోనే మేఘా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులు ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ రంగంలోనే తయారవుతుండేవి. అయితే తొలిసారిగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు రంగంలో ఈ రిగ్గులను తయారు చేసింది మేఘా సంస్థ. గుజరాత్ లోని అహ్మదాబాద్ కలోల్ చమురు క్షేత్రంలో ఈ రిగ్గు ద్వారా లాంఛనంగా పని మొదలు పెట్టారు.
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారి ఎంఈఐఎల్ సొంతంగా తయారు చేసిందని తెలిపారు ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి. 1500 హార్స్ పవర్ సామర్థ్యంతో తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ రిగ్గు భూ ఉపరితలం నుంచి 4 కిలో మీటర్ల లోతు వరకు చమురు బావులను సులభంగా తవ్వగలుగుతుంది. ఎంఈఐఎల్ ఈ రిగ్గును 40 సంవత్సరాల పాటు పని చేసేలా తయారు చేసింది. అహ్మదాబాద్ సమీపంలో గల కలోల్ క్షేత్రంలో దామాసన గ్రామంలో ఉన్న చమురు బావి కె.ఎల్.డి.డి.ఎక్స్ ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రిగ్గు ద్వారా తవ్వుతున్నారు. చమురు బావులను వేగంగా తవ్వడంతో పాటు తక్కువ విద్యుత్ తో ఈ రిగ్గు పనిచేస్తుంది. హైడ్రాలిక్, ఆటోమేటెడ్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు.
2019లో 6 వేల కోట్ల రూపాయల టెండర్లను ఓఎన్జీసీ నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా 47 డ్రిల్లింగ్ రిగ్గులను తయారు చేసి సరఫరా చేయాల్సి ఉంది. ఈ ఆర్డర్ లో భాగంగా మొదటి రిగ్గును అహ్మదాబాద్ లోని చమురు క్షేత్రంలో వినియోగంలో తెచ్చింది. మిగిలిన 46 రిగ్గుల తయారీ వివిధ దశల్లో ఉన్నట్టు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.
వర్క్ ఓవర్ రిగ్గులు 20..
అప్పటికే తవ్విన చమురు బావిలోని నిక్షేపాలను పూర్తి స్థాయిలో వెలికితీయడం, చమురు బావుల ఉత్పాదకతను పెంచడంతో పాటు చమురు బావులను మరమ్మతులు చేయడానికి ఉపయోగపడే వాటిని వర్క్ ఓవర్ రిగ్గులు అంటారు. ఎంఈఐఎల్ తయాలు చేస్తున్న 20 వర్క్ ఓవర్ రిగ్గులలో 50 ఎంటి సామర్థ్యం కలిగినవి 12 కాగా, 100 ఎంటి సామర్థ్యం కలిగినవి 4, 150 ఎంటి సామర్థ్యం కలిగినవి మరో 4 ఉన్నాయి.
ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు 27
భూ ఉపరితలం నుండి భూగర్భంలో ఉన్న చమురు నిక్షేపాల వరకు భూ పొరలను తవ్వే అత్యాధునిక రిగ్గులను ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు అంటారు. ఇవి 1500 మీటర్ల నుండి 6000 మీటర్ల వరకు భూమిలోపల తవ్వగలవు. మామూలు రిగ్గులయితే 1000 మీటర్ల వరకు మాత్రమే తవ్వగలవు. వీటిలో 1500 హెచ్ పి సామర్థ్యంతో పనిచేసే 2 మొబైల్ హైడ్రాలిక్ రిగ్గులు ఉన్నాయి. 1500 హెచ్ పి ఏసి వీఎఫ్ డి టెక్నాలజీ కలవి 17 ఉన్నాయి. 2000 హెచ్.పి. సామర్థ్యంతో ఉన్నవి 6 ఉన్నాయి. వీటితోపాటు మరో రెండు రిగ్గులు కూడా ఇదే సామర్థ్యంతో పనిచేస్తాయి. 2వేల హెచ్ పి సామర్థ్యం ఉన్న రిగ్గులు భూమి ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతు వరకు తవ్వగలవు. భారత్ లో ఇలాంటి సామర్థ్యం ఉన్న రిగ్గులను కేవలం ఎంఈఐల్ మాత్రమే తయారు చేస్తోంది.
మేకిన్ ఇండియా నినాదం.. మేఘా విధానం..
మొత్తం 47 రిగ్గులలో గుజరాత్‌లో ఒకటి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రాగా రెండవ రిగ్గు డ్రిల్లింగ్ కార్యకలాపాలు మరి కొద్ది రోజుల్లో మొదలవుతాయి. తయారీలో ఉన్న 46 రిగ్గులలో రెండు రిగ్గులు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి చమురు క్షేత్రంలో అసెంబ్లింగ్ దశలో ఉండగా మిగతా వాటిని అసోం, త్రిపుర, తమిళనాడులోని ఓఎన్జీసీకి సంబంధించిన చమురు క్షేత్రాలకు ఎంఈఐఎల్ అందించాల్సి ఉంది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో తయారైన ఈ రిగ్గుని భారతీయ నవరత్న కంపెనీలలో ఒకటైన ఓఎన్జీసీకి అందజేయటం ఎంఈఐఎల్ కు గర్వకారణం అని అన్నారు వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి. దేశీయంగా చమురు ఉత్పత్తి పెంచి విదేశాలనుంచి దిగుమతి తగ్గించటం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం దోహద పడుతుందని చెప్పారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గుల కోసం ఇప్పటివరకు విదేశాలపైనే ఆధారపడ్డ భారత్ కు మేఘా ఇంజనీరింగ్ ఒక ఆశాకిరణంగా మారిందని ఆయన తెలిపారు. రిగ్గుల తయారీలో విదేశీ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రిగ్గులను తయారు చేసిన ఘనత మేఘా సొంతం చేసుకుందని, ఇది మేఘానే కాదు దేశం మొత్తం గర్వపడాల్సిన విషయమని అభిప్రాయపడ్డారు. మేకిన్ ఇండియా నినాదాన్ని తమ విధానంగా మేఘా సంస్థ మార్చుకుందని చెప్పారు.