Telugu Global
National

మహారాష్ట్రలో లాక్ డౌన్ పార్ట్-2

అనుకున్నంతా అయింది. మహారాష్ట్ర సర్కారు లాక్ డౌన్ అనౌన్స్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఇది నైట్ లాక్ డౌన్ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈరోజునుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. రాత్రి 8గంటలనుంచి ఉదయం 7 గంటలవరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. దీనితోపాటు ఈవారం వీకెండ్ లాక్ డౌన్ కూడా ఉంటుంది. అంటే శుక్రవారం రాత్రి 8గంటలనుంచి మొదలయ్యే కర్ఫ్యూ సోమవారం ఉదయం 7 గంటలకు పూర్తవుతుంది. దీనికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు […]

మహారాష్ట్రలో లాక్ డౌన్ పార్ట్-2
X

అనుకున్నంతా అయింది. మహారాష్ట్ర సర్కారు లాక్ డౌన్ అనౌన్స్ చేసింది. అయితే ప్రస్తుతానికి ఇది నైట్ లాక్ డౌన్ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈరోజునుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. రాత్రి 8గంటలనుంచి ఉదయం 7 గంటలవరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. దీనితోపాటు ఈవారం వీకెండ్ లాక్ డౌన్ కూడా ఉంటుంది. అంటే శుక్రవారం రాత్రి 8గంటలనుంచి మొదలయ్యే కర్ఫ్యూ సోమవారం ఉదయం 7 గంటలకు పూర్తవుతుంది. దీనికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.

ఆంక్షలు ఇవీ..
– రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలి
– ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరు కావాలి, దీని ప్రకారం వారు టైమ్ టేబుల్ వేసుకోవాలి.
– హోటళ్లలో తినడం నిషేధం, కేవలం పార్శిల్ సేవలకు మాత్రమే అనుమతి
– రాత్రిపూట పూర్తిగా కర్ఫ్యూ అమలులో ఉంటుంది, కారణం లేకుండా ఇల్లు దాటి బయటకు వస్తే లాఠీ దెబ్బలు పడ్డట్టే
– బస్సులు, రైళ్లు కూడా 50శాతం సీటింగ్ కెపాసిటీనే ఉపయోగించాలి. సీటు మార్చి సీటులో ప్రయాణికులు కూర్చోవాలి.
– కర్ఫ్యూ అమలవుతున్న సమయంలో హోటళ్లు, మాల్స్‌, రెస్టారెంట్లు, బార్లు, సినిమా థియేటర్లు పూర్తిగా మూసివేత
– నిర్మాణ, పారిశ్రామిక కార్యకలాపాల కొనసాగింపుకి అనుమతి
– కూరగాయల మార్కెట్లలో ప్రజలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలు
– సినిమా థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీతో టికెట్ల అమ్మకం. ఫస్ట్ షో, నైట్ షో ఉండవు. సినిమా, సీరియల్ షూటింగ్ లపై ఆంక్షలు.
గత కొన్నిరోజులుగా కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం మహారాష్ట్రపై ఎక్కువగా కనపడుతోంది. దేశం మొత్తం నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రనుంచే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పెడతారనే ఉహాగానాలు వినిపిస్తున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకూ సాహసించలేదు. కేసుల సంఖ్య తగ్గకపోవడంతో నైట్ లాక్ డౌన్ విధించింది. అయినా కేసులు పెరిగితే పూర్తి స్థాయి లాక్ డౌన్ కి వెనకాడబోమని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

First Published:  4 April 2021 9:38 PM GMT
Next Story