ప్రచారంలో దేవుళ్ల ఫొటోలు.. కమల్‌పై కేసు.. !
ప్రముఖ సినీ హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ పై కేసు నమోదైంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం 7 గంటల వరకే ప్రచారానికి గడువు ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. కమల్ హాసన్ సైతం తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన కూతురు అక్షర, నటి సుహాసిని సైతం ప్రచారంలో పాల్గొన్నారు. అటు డీఎంకే, అన్నాడీఎంకే అగ్రనేతలు కూడా విస్తృతంగా ప్రచారం […]
ప్రముఖ సినీ హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ పై కేసు నమోదైంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం 7 గంటల వరకే ప్రచారానికి గడువు ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. కమల్ హాసన్ సైతం తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన కూతురు అక్షర, నటి సుహాసిని సైతం ప్రచారంలో పాల్గొన్నారు. అటు డీఎంకే, అన్నాడీఎంకే అగ్రనేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
ఇదిలా ఉంటే ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ హిందూ దేవుళ్లయిన శ్రీరాముడు, అమ్మవారి వేషధారణలో కొంతమందిని తన ప్రచారరథం పైకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వీళ్లంతా మనదేవుళ్లు. కానీ కొన్ని పార్టీలు మాత్రం ఈ దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నాయి’ అంటూ ప్రసంగించారు. ఈ ప్రసంగం తీవ్ర వివాదాస్పదం అయ్యింది.
కమల్ హాసన్ ఓ వర్గాన్ని కించపరిచారని.. చట్ట విరుద్ధంగా ప్రచారంలో దేవుళ్ల ను వాడుకున్నారని.. సమాజంలో అశాంతిని సృష్టించడానికి యత్నించారని కొందరు ఆరోపణలు చేశారు. అంతేకాక కమల్‌పై కేసు కూడా పెట్టారు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయడంతో కమల్ సహా ముగ్గురిపై కాట్టూరు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది.
కాగా, కమల్ ప్రసంగంలో తప్పేం ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. మరికొందరేమో ఆయన ఓ వర్గాన్ని కించపరుస్తున్నారంటూ వ్యాఖ్యనిస్తున్నారు. ఈ ఘటన ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.