Telugu Global
Cinema & Entertainment

నాగ్ కోసం చిరు ప్రమోషన్

ఓ పెద్ద హీరో సినిమా ప్రమోషన్ కు మరో పెద్ద హీరో వస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి అరుదైన సన్నివేశాల్ని అడపాదడపా అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మహేష్ బాబు మూవీ ఫంక్షన్ కు గతంలో ఎన్టీఆర్ వచ్చాడు. ఇప్పుడు అదే బాటలో నాగార్జున మూవీకి స్వయంగా చిరంజీవి ప్రచారం కల్పిస్తున్నాడు. రీసెంట్ గా వైల్డ్ డాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా నడుస్తోంది. ఇప్పుడు దీనికి […]

నాగ్ కోసం చిరు ప్రమోషన్
X

ఓ పెద్ద హీరో సినిమా ప్రమోషన్ కు మరో పెద్ద హీరో వస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి అరుదైన సన్నివేశాల్ని
అడపాదడపా అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మహేష్ బాబు మూవీ ఫంక్షన్ కు గతంలో ఎన్టీఆర్
వచ్చాడు. ఇప్పుడు అదే బాటలో నాగార్జున మూవీకి స్వయంగా చిరంజీవి ప్రచారం కల్పిస్తున్నాడు.

రీసెంట్ గా వైల్డ్ డాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా
ఓ మోస్తరుగా నడుస్తోంది. ఇప్పుడు దీనికి ప్రచారం కల్పించే బాధ్యతను చిరంజీవి భుజానికెత్తుకున్నాడు.
ఈరోజు ప్రత్యేకంగా వైల్డ్ డాగ్ ప్రచారం కోసమే ప్రెస్ మీట్ పెట్టారు చిరంజీవి. తన స్నేహితుడు నాగ్ నటించిన వైల్డ్ డాగ్ ను ఆకాశానికెత్తేశారు.

అయితే చిరంజీవి ప్రచారం ఈ సినిమాకు పెద్దగా కలిసొచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వైల్డ్ డాగ్ సినిమాకు వసూళ్లు తగ్గిపోయాయి. పని దినాల్లో ఇక ఈ సినిమా ఆడే పరిస్థితి లేదు. సో.. వైల్డ్ డాగ్ కు చిరు ప్రచారం పెద్దగా కలిసిరాకపోవచ్చు.

First Published:  5 April 2021 4:21 PM IST
Next Story