Telugu Global
Cinema & Entertainment

ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ

ఎన్ఐఏ ఆఫీసర్ అనగానే టాలీవుడ్ లో గుర్తొచ్చే పేరు నాగార్జున. అతడు ఎన్ఐఏ ఆఫీసర్ గా నటించిన వైల్డ్ డాగ్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఎన్ఐఏ ఆఫీసర్ రెడీ అయ్యాడు. ఈసారి ఈ పాత్ర పోషించే అవకాశం కార్తికేయకు దక్కింది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తాన్యా రవిచంద్రన్ ఇందులో హీరోయిన్. సుధాకర్ కోమాకుల ప్రత్యేకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ […]

ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ
X

ఎన్ఐఏ ఆఫీసర్ అనగానే టాలీవుడ్ లో గుర్తొచ్చే పేరు నాగార్జున. అతడు ఎన్ఐఏ ఆఫీసర్ గా నటించిన
వైల్డ్ డాగ్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లో మరో ఎన్ఐఏ ఆఫీసర్ రెడీ
అయ్యాడు. ఈసారి ఈ పాత్ర పోషించే అవకాశం కార్తికేయకు దక్కింది.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తాన్యా రవిచంద్రన్
ఇందులో హీరోయిన్. సుధాకర్ కోమాకుల ప్రత్యేకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తాజా షెడ్యూల్
ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

వినాయక్ శిష్యుడైన శ్రీ సరిపల్లి ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికీ సగం
సినిమా పూర్తైయింది. ఈ నెలాఖరు వరకు హైదరాబాదులో జరిపే షెడ్యూల్ తో 90 శాతం పూర్తవుతుంది.
మిగిలిన 10 శాతాన్ని మారేడుమిల్లి లో చిత్రీకరిస్తారు.

ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. ’మెంటల్ మధిలో’, ’దొరసాని’,’అంతరిక్షం’ చిత్రాలకు
స్వరాలందించిన ప్రశాంత్. ఆర్. విహారి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా టైటిల్
ప్రకటిస్తారు.

First Published:  3 April 2021 3:20 PM IST
Next Story