టీటీడీ నిర్ణయం పట్ల మాజీ అర్చకుల హర్షం..
అర్చకత్వానికి వయసుకి సంబంధం పెడుతూ టీడీపీ హయాంలో గత పాలకవర్గం తీసుకున్న నిర్ణయంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న చాలామంది పూజారులు పదవీ విరమణ చేశారు. ఊపిరున్నంత వరకు స్వామి వారి సేవలో తరించాలనుకున్న వారు, అప్పటి పాలక మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2018లో కోర్టుని ఆశ్రయించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులను వయసుతో సంబంధం లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే వయోభారం కారణంగా స్వామివారి కైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో గత పాలక […]
అర్చకత్వానికి వయసుకి సంబంధం పెడుతూ టీడీపీ హయాంలో గత పాలకవర్గం తీసుకున్న నిర్ణయంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న చాలామంది పూజారులు పదవీ విరమణ చేశారు. ఊపిరున్నంత వరకు స్వామి వారి సేవలో తరించాలనుకున్న వారు, అప్పటి పాలక మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2018లో కోర్టుని ఆశ్రయించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులను వయసుతో సంబంధం లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే వయోభారం కారణంగా స్వామివారి కైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో గత పాలక మండలి కోర్టు తీర్పును అమలు చేయలేదు, అప్పటినుంచీ ఆ వివాదం అలాగే కొనసాగుతోంది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మరోసారి ఈ విషయంపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలకమండలి చర్చలు జరుపుతూ వచ్చింది. తాజాగా గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో రిటైర్ అయిన అర్చకులంతా తిరిగి స్వామివారి సేవకు అర్హులేనని తేలింది. గత పాలకమండలి నిర్ణయం ద్వారా ఇబ్బంది పడ్డవారిలో టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన రమణ దీక్షితులు కూడా ఉన్నారు. టీటీడీ తాజా నిర్ణయంతో ఆయన కూడా తిరిగి విధులకు హాజరవుతారని తెలుస్తోంది. రమణ దీక్షితులు తిరిగి ప్రధాన అర్చకుల హోదాలో ఆలయప్రవేశం చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు అదే పోస్ట్ లో కొనసాగుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. టీటీడీ నిర్ణయం పట్ల మాజీ అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.